Friday, March 14, 2014

Do we clean Ear wax regularly?,చెవిలో గులిమి తీయాలా?వద్దా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : చెవిలో గులిమి తీయాలా?వద్దా?
జ : ప్రస్తుత సమాజంలో మనకు తరచుగా కనబడే దృశ్యం చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుకుంటూ తాదాత్మ్యం పొందుతున్న అనుభూతి చెందడం! కొంతమందికి రోజుకు ఒకసారైనా చెవిలో ఏదో ఒకటి పెట్టి కాసేపు అటూ ఇటూ తిప్పకపోతే ఏమీ తోచదు. మరి కొంతమంది కనీసం వారానికో సారైనా చెవిని శుభ్రం చేసుకోక పోతే ఎలా అనుకుంటూ గులిమి తీసుకునే పనిలో నిమగమైపో తుంటారు. ఇదంతా చెవి ఆరోగ్యం పట్ల తమకున్న శ్రద్ధేననుకుంటూ సంబరపడి పోతుంటారు. అసలు చెవిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నకు... అస్సలు లేదన్న జవాబే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెవులు తమలోని భాగాలను వాటంతట అవే శుభ్రం చేసుకుంటాయి కాబట్టి.మానవ శరీరం అనేక అవయవాల సమ్మిళితం. దాదాపు అన్ని అవయవాలను మనం శుభ్రం చేసుకోవాల్సిందే. కానీ - చెవులను మాత్రం మనం ప్రత్యేకించి శుభ్రం చేయనక్కర్లేదు.  అయితే చెవిలో కొద్దిపాటి ఉండే గులిమి, నులివెంట్రుకలు చెవిలోనికి చీమలు, చిన్న చిన్న పురుగులు, ఇసుక రేణువులు వెళ్ళకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. మరి అటువంటప్పుడు గులిమిని పూర్తిగా తొలగించాలనుకోవడం ఎంత వరకు సమంజసం? అందుకే చెవిని శుభ్రం చేసుకునే బృహత్తర కార్యక్రమాన్ని విరమిస్తే ఎంతో మంచిది.

ఇకపోతే - చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పాలనుకోవడానికి మరో ముఖ్యకారణం దురద! చెవిలో దురదగా ఉందన్న భావన కలగడంతోటే అందుబాటులో ఉన్న పెన్నునో, పెన్సిల్‌నో ఆడపిల్లల యితే తలపిన్నునో అలవోకగా చేతుల్లోకి తీసుకోవడం చెవుల్లో పెట్టి అటూ ఇటూ తిప్పడం సహజం! ఇందువల్ల దురదయితే తాత్కాలికంగా తగ్గుతుంది. కాసేపు ఎంతో హాయిగా ఉంటుంది. కొద్దిసేపు గడచిన తర్వాత మొదలవుతుంది అసలు బాధ... అదే భరించలేని చెవినొప్పి! చెవి డాక్టర్‌ను సంప్రదించడమే ఇక తక్షణ కర్తవ్యం.

  • గులిమి చెవులకు రక్ష.
  • గులిమి చెవి లోపలికి నీళ్లు, ఇన్‌ఫెక్షన్ల వంటివి జొరబడకుండా కాపాడుతుంది.
  • చెవిలో దుమ్మూధూళీ పోగుపడటం వల్లనే గులిమి ఏర్పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మన చెవి మార్గం గోడల చర్మంలో సిరుమెన్‌ అనే ప్రత్యేకమైన గ్రంథులుంటాయి. వీటి నుంచే గులిమి పుట్టుకొస్తుంది. కాస్త జిగురుగా ఉండే ఈ గులిమి చెవి లోపలికి ఇన్‌ఫెక్షన్‌ కారకాలు, నీళ్ల వంటివి వెళ్లకుండా అడ్డుపడుతుంది. సాధారణంగా ఇది కొంతకాలానికి ఎండిపోయి.. పోగుపడిన దుమ్ము, రాలిపోయిన చర్మ కణాలతో పాటు బయటికి వూడి వచ్చేస్తుంది. అందువల్ల ప్రత్యేకించి గులిమిని తీయాల్సిన అవసరమేమీ ఉండదు. కానీ దురద, ఏదైనా అసౌకర్యం వంటివి ఉంటే.. ఇన్‌ఫెక్షన్లకు దారితీసే అవకాశముంటుంది కాబట్టి గులిమిని తీయాల్సి రావొచ్చు. కానీ అది కూడా నిపుణులైన డాక్టర్‌తోనే తీయించుకోవాలి. ముందు చుక్కల మందు వేసి, మెత్తబడ్డాకే గులిమిని తీస్తారు. ఎందుకంటే చెవి మార్గంలోని గోడల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నపాటి గాయమైనా దెబ్బతింటుంది. అంతేకాదు సరిగా శుభ్రం చేయకపోతే చెవి మార్గం చివరన ఉండే కర్ణభేరికి రంధ్రం పడొచ్చు. దీంతో వినికిడి దెబ్బతింటుంది, లోపలి చెవికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదమూ పెరుగుతుంది. దూది చుట్టిన పుల్లలతో (ఇయర్‌ బడ్స్‌) తిప్పటం వల్ల గులిమి మరింత లోపలికి పోవచ్చు కూడా. అందువల్ల చెవిలో పుల్లలు, పిన్నులతో కెలకడటం ఎంత మాత్రమూ మంచిది కాదని గుర్తుంచుకోవాలి. అలాగే గులిమి తీసేవారితో చెవులను శుభ్రం చేయించుకోవటమూ పనికిరాదు.`
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.