Saturday, March 1, 2014

My testicle became smaller why?,వృషణం చిన్నదైపోయింది...ఎందుకిలా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 వృషణం చిన్నదైపోయింది...ఎందుకిలా?

Q : నాకు 25 ఏళ్లు. ఐదేళ్ల కిందట కుడి వృషణంలో అకస్మాత్తుగా నొప్పి వచ్చి, ఆ తరవాత వాచింది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాను. ఆ తర్వాత ఆర్నెల్లకు కుడివైపు వృషణం బఠాణీ గింజంత అయిపోయింది. ఎడమవైపు వృషణం మాత్రం మామూలుగానే ఉంది. పెళ్లయిన తర్వాత ఇది దాంపత్య జీవితానికి ఏమైనా అడ్డంకా?

A :మీరు మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు మంచి డాక్టర్ ని సంప్రందించి .. డాప్లర్ అల్ట్రా సౌండ్ స్క్రోటమ్ పరీక్ష చేయించి ఉంటే అది వృషణంలో ఇన్ఫెక్షనా (ఎపిడైడమో ఆర్కయిటిస్) లేకపోతే వృషణం మడతపడటమా (టెస్టిక్యులార్ టార్షన్) అనే విషయం తెలిసి ఉండేది. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మడత పడినప్పుడు ఆరుగంటల్లోపు ఆపరేషన్ చేసి వృషణాన్ని నార్మల్ పొజిషన్‌కి ఉంచితే అది సక్రమంగా పనిచేసేది. అలా చేయకపోతే వృషణానికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయి తర్వాత చిన్నదైపోతుంది. అప్పుడు వీర్యకణాలను ఉత్పత్తి చేయలేదు. కేవలం సెక్స్ హార్మోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటివారిలో నొప్పి ఉన్నా, లేకపోయినా రెండో వైపు వృషణాన్ని ఫిక్స్ చేసుకోవడం (ఆర్కిడోపెక్సీ) మంచిది. అప్పుడు రెండోవైపు మడత పడే సమస్య రాదు. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలిసి ఆర్కిడోపెక్సీ గురించి వివరాలను తెలుసుకోండి.

 *===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.