Thursday, March 6, 2014

వై-ఫై (Wi-Fi) కనెక్షన్‌ ఉండడము వలన ఆరోగ్యవిషం లో అందోళనపడాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?.




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఇంట్లో 24 గంటలూ వై-ఫై (Wi-Fi) కనెక్షన్‌ ఉండడము వలన ఆరోగ్యవిషం లో అందోళనపడాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?.

జ : మఒబైల్ ఫోన్లు లేదా వై-ఫై రోటర్లు విడుదల చేసే తక్కువ స్థాయి ఎలక్ట్రో మేగ్నెటిక్ రేడియేషన్‌ (ఇఎమ్‌ఆర్)వల్ల ఆరోగ్యము పై హానికర ప్రభావాలుటాయన్న దానికి శాస్త్రీయ బద్ధమైన ఆధారాలేవీ లేవు . ఇ.ఎమ్‌.ఆర్ కు దీర్ఘకాలము ఎక్ష్పోజ్ కావడము వలన దీర్ఘకాలిక ప్రభావాలకు సంబంధించిన డేటా అయితే లేదుగాని .... తలనొప్పి , చెవుల్లోమోగుతున్నట్లుండడం , నిద్రలేమి , మూడ్ స్వింగ్స్ కు గంటలతరబడి మొబైల్ వాడడం కారణమన్న ఆధారాలున్నాయి . ఏది ఏమైనా కనీసమాత్రము గా ఎక్ష్పోజ్ కావాలని , ముఖ్యముగా పిల్లల విషయములో పాటించాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. రాత్రివేళలలో వై-ఫై స్విచ్చాఫ్ చేస్తే మంచిది. మొబైల్ కబులు కూడా తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.