Tuesday, March 18, 2014

How to prevent Tension in daily life?,దైనందిన జీవితములో వత్తిడికి చెక్ ఎలా పెట్టాలి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : How to check Tension in daily life?,దైనందిన జీవితములో వత్తిడికి చెక్ ఎలా పెట్టాలి?
జ : ప్రతి రోజూ చేయాల్సిన అనేకానేక పనుల వల్ల ఎదో ఒక విధము గా ఒత్తిడి వేధిస్తుంది . చిన్నచిన్న చర్యలతో వత్తిడిని ఇట్టే తగ్గించుకోవచ్చును .
  • కామెడీ కార్యక్రమాలు చూసినా , 
  • సరదా గా గడిపినా , 
  • కామిక్ పుస్తకాలు చదివినా , 
  • మనస్పూర్తిగా నవ్వినా , ..................... స్ట్రెస్ హార్మోనులు స్థాయిలు తగ్గిపోతాయి. ఒత్తిడి బాగా తగ్గిపోతుంది .
 ఇష్టపడే వారితో కొంత సమయము గడపడము వలన చాలా ఫలితాలుంటాయి . కుటుంబ సభ్యులైనా , మిత్రులైనా సరే .. వారిని లంచ్ కో , డిన్నర్ కో ఆహ్వానించడమో లేదా వారింటికి వెళ్ళడమో చేస్తూ ఉంటే బాగా రిలాక్ష్ అవుతారు. ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉంటాయి.  అనవసరమైన ఆందోళనలు నుంచి బుర్రను పరిరక్షించుకున్నవారవుతారు.

  • ఫేవరెట్ పాటలు వినడము వలన ఒత్తిడి వేదించదు . 
  • పార్కు లో ఓ పదినిముషాలు నడక ఎంటో ప్రశాంతతనుస్తుంది. 
  • ఆఫీసులో ఓ 5 నిముషాలు అటు , ఇటు పచార్లు కొట్టడము  , మెట్లు ఎక్కి .. దిగడము 
  • ఇంట్లో ప్రాణాయామం చేయడము ,
  • ఎక్షరసైజు చేయడము , 
  • స్నేహితులతో మార్నింగ్ వాక్ కి వెళ్ళడము , 
  • నరుగురి తో పిచ్చాపాటి హస్క్ వేసుకోవడము ,  ..............వలన కొంతవరకు మెంటల్ టెన్షన్‌ తగ్గుతుంది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.