Sunday, February 3, 2013

Alzimers disease, forgetfulness, తరచుగా విషయాలు మర్చిపోతున్నాను కారణము ఏమైఉంటుంది?,అల్నీమర్ వ్యాది



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : తరచుగా విషయాలు మర్చిపోతున్నాను . మాటల్లో ఒక్కోసారి పదాలు కుడా గుర్తుకు రావడము లేదు . కారణము ఏమైఉంటుంది?, ఇది అల్జీమర్స్ తొలిదశ అనుకోవాలా?.

జ : ఇలా జ్ఞాపకశక్తి పోవడానికి ఎన్నో కారణాలుంటాయి.
  • ఒత్తిడి , 
  • డిప్రెషన్‌ , 
  • యాంగ్జైటీ , 
  • పోషకాహారలోపాలు , 
  • స్ట్రోక్ , 
  • ఎక్కువ ఆల్కహాల్ అలవాటు , 
  • అల్నీమర్ వ్యాది , 
  • డిమెన్సియా ,   లాంటి ఎన్నో కారణాలు . జ్ఞాపకశక్తి పోవడానికి దారితీస్తాయి. 
అల్జీమర్ వ్యాధి ఒక రకం దెమిన్షియా లాంటిది . తొలిదశలో జ్ఞాపకశక్తి తగ్గడము ... లేదా ఏకాగ్రత లోపించడం వంటి ఇతర కారణాల మాదిరే కనిపిస్తాయి  . ఒక సారి మంచి వైద్యుని కవండి . తగిన పరిష్కారము సూచిస్తారు. 
వయసు తో వచ్చే వ్యాధుల్లో " అల్జీమర్స్ " ఒకటి . ఇది మెదడుకు సంబంధినది . మెదడు కణాలలో ఏర్పడిన లోపం జ్ఞాపకశక్తిని హరిస్తుంది. గతములో చూసినది ... అవసరము అనుకున్నప్పుడు గుర్తుకురాదు.

మనుషులనైనా ,వస్తువులనైనా జ్ఞాపకము పెట్టుకోవడములో ఇబ్బంది ఉంటుంది. అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే పండ్లు , పండ్లరసాలు , కాయకూరలు , సూప్ లు ఆహారము లో భాగము గా చేసుకోవాలి. ఇలా పండ్లు , కాయకూరలు తినేవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశము 76%తక్కువగా ఉంటుందని తేలింది.  మెదడు కణాలలో " బీటా ఎమైలాయిడ్ " ప్రోటీన్‌ చేరడము వల్ల అల్జీమర్స్ వస్తుంది. అలా చేరే ప్రోటీన్‌ ని నిరోధించే శక్తి కలగిన పాలీఫీనాల్ రసాయనాలు పండ్ల రసాలలో ఉంటాయి.

చికిత్స :

వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపును, తికమకను తెచ్చిపెట్టే అల్జీమర్స్‌ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకునే వీలుంది.

    * ఒమేగా-3, ఒమేగా-6, విటమిన్‌ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, అక్రోటుపప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి.
    * వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ ముప్పూ తగ్గుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది.
    * మెదడుకు మేత పెట్టే చిక్కు సమస్యలను పరిష్కరించటం, పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటివి చేయాలి. మెదడులోని కణాలు చురుకుగా ఉండేలా చేస్తున్నకొద్దీ ఆరోగ్యకరమైన కణాలు సజీవంగా ఉంటాయి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
    * వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్‌కు అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది.
    * తగినంత నిద్రపోవాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది. శరీరానికి, మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు మెదడునూ చురుకుగా ఉంచుతాయి.
    * మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి.

  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.