Thursday, September 11, 2014

మెనోపాజ్‌ తరవాత కలయిక అసౌకర్యంగా ఉంటుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పెళ్లయినప్పటినుంచీ నేను లైంగికచర్యను ఆనందిస్తున్నా. ఇప్పుడు నా వయసు యాభై సమీపిస్తోంది. మెనోపాజ్‌ తరవాత జననేంద్రియాల్లో మార్పు వస్తుందని విన్నా. అది నిజమైతే ఎలాంటి మార్పులు జరుగుతాయి? కలయిక అసౌకర్యంగా ఉంటుందా?

జ : మెనోపాజ్‌ దశ మొదలయ్యాక అండాశయాలు ఈస్ట్రోజెన్‌ విడుదలను ఆపేస్తాయి. దాంతో మెనోపాజ్‌లో జననేంద్రియాలు పొడిబారతాయి. అంతేకాదు కలయిక సమయంలో సంకోచవ్యాకోచాలు చాలామటుకు తగ్గుతాయి. ఈ సమయంలో ఈస్ట్రోజెన్‌ని చాలా తక్కువ మోతాదులో జననేంద్రియాల నుంచి తీసుకోవడంతో ఇలాంటి సమస్యల్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. అందుకు వైద్యుల సూచన మేరకు క్రీంలు వాడొచ్చు. అవి వాడుతున్నా జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉండాలంటే మెనోపాజ్‌ దశలోనూ క్రమం తప్పకుండా లైంగికచర్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జననేంద్రియాల కండరాలు దృఢంగా మారతాయి. అప్పుడు కొంత అసౌకర్యం ఉన్నా, కలయిక సమయంలో సంకోచవ్యాకోచాలు సరిగ్గా ఉంటాయి. సాధారణంగా ఆ అసౌకర్యాన్ని నివారించడానికి వైద్యులు ఎక్కువసేపు పనిచేసే వెజైనల్‌ మాయిశ్చరైజర్లను సూచిస్తారు. వాటిని వాడుతూనే కలయికలో పాల్గొనడం వల్ల మెనోపాజ్‌లో ఎదురయ్యే బాధా, అసౌకర్యం తగ్గుతాయి.

  • courtesy with : Dr.Sharmila Mujundhar(sexologist) Hyd.

 *===========================

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.