Sunday, September 14, 2014

మన పేగుల్లో మంచి బాక్టీరియా కూడా ఉంటుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బాక్టీరియా అంటే మనకు హానిచేసేవి అని అంటారు కాని మన పేగుల్లో మంచిబాక్టీరియా ఉంటుందని విన్నాను నిజమేనా?.

జ : మంచి బ్యాక్టీరియా : మన పేగుల్లో 500 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వీటిల్లో హాని చేసేవే కాదు. మేలు చేసేవీ ఉంటాయి. మన ఆహారం, జీవనశైలి ఈ బ్యాక్టీరియా సరైన పాళ్లలో ఉండేందుకు తోడ్పడతాయి. ఎప్పుడైనా మంచి బ్యాక్టీరియా తగ్గిపోయినప్పుడు డాక్టర్లు మాత్రల రూపంలో ప్రొబయోటిక్స్‌ ఇస్తుండటం తెలిసిందే. అయితే మాత్రల అవసరం లేకుండా సహజంగానే మంచి బ్యాక్టీరియాను పెంచుకునే అవకాశమూ ఉంది.

* పెరుగు : రోజూ పెరుగు తినటం మూలంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

* పీచు : మనం తినే ఆహారాన్నే పేగుల్లోని బ్యాక్టీరియా తిని జీవిస్తుంది. మంచి బ్యాక్టీరియా పీచును.. చెడ్డ బ్యాక్టీరియా చక్కెర, మద్యపానాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అందువల్ల పీచు దండిగా ఉండే ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాల వంటివి తింటే మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.