Monday, September 1, 2014

గర్భము తొలి నెలల్లో ఐరన్‌-కాల్సియం -బికాంప్లెక్ష్ సప్లిమెంట్స్ వాడవచ్చునా?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఏడు వారాల గర్భవతిని. మందులు వేసుకోవాలేమోఅన్న ఆలోచనవల్ల సిక్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది . ఐరన్‌, క్యాల్సియం , బి కాంప్లెక్ష్ వంటి సప్లిమెంట్లు రోజూ వాడవలసిందేనా?.

జ : తొలి పన్నెండు వారాల్లో బిడ్డ పతి అవయము రూపుదిద్దుకుంటుంది. ఈ తొలి మూడు నెలల్లో మందులు వాడకూడదన్నది (అవసరమైతే మినహా) ప్రాథమిక నిబంధన . 16 వారాలు పూర్తయ్యేదాకా ఐరన్‌ , క్యాల్సియం , బి కాంప్లెక్ష్ సప్లిమెంట్లు అవసరం లేదు.  పైగా తొలి 4 వారాల్లోపు  వికారము , వాంతులు ఎక్కువగా ఉంటాయి. కనుక ఐరన్‌ వాడితే ఈ లక్షణాలు కొంచెము పెరగవచ్చును . ఈ దశలో ఫోలిక్ యాసిడ్ మాత్ర చాలు. పండ్లు , కాయగూరలు , పాలు ఎక్కువగా ఇస్తుండాలి. మీరు బలహీనముగా ఉంటే-తప్ప ఏ మందులు (సప్లిమెంట్సు ) అవసరము ఉండదు. 4 గో నెలనుండి మాతము సప్లిమెంట్స్ వాడవలసినదే.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.