Monday, September 29, 2014

టీనేజీ లో ఋతుక్రమము సరిగా ఉండదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మా అమ్మాయి 14 సం.లు.రజస్వల అయి 6 మాసాలే అయినది. ఋతుక్రమము సక్రమముగా , రెగ్యులర్ గా రావడములేదు . ఎందువలన? 

జ : టీనేజ్ లో అమ్మాయిలకు ఋతుక్రమము రెగ్యులర్ గా ఉండదు. ఒక్కోసారి  నెలలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు రావచ్చు . ఒక్కోసారి కొద్దినెలల దాకా రాకపోవచ్చు. ఎదుగుదల క్రమములో శరీరము సర్దుబాటు చేసుకునే వయసులో అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు నొప్పితో కూడుకొని ఉంటుంది. . . దీనిని డాక్టర్లు ఎనొవిలేటరీ (enovilatory) సైకిల్స్ అంటారు.

ఋతుక్రమము 2 ఏళ్ళ పరిధి లో సక్రమము గా సర్దుకుంటుంది. అయితే ఋతుస్రావము భారీగా ఉండి , నెలలో ఒకసారికంటే ఎక్కువ సార్లు వస్తుంటే పరీక్షలు చేయించుకోవాలి. దీనివలన ఐరన్‌ లోపాలు , హార్మోనుల సమస్యలు , కొన్ని సార్లు క్లాటింగ్ సమస్యలు ఉంటే ముందుగా తెలుస్తాయి. తదనుగునము గా మందులు వాడుకోవచ్చును.

  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.