Saturday, September 13, 2014

What is Spa treatment?, స్పా-చికిత్సలు అంటే ఏమిటి? జాగ్రత్తలేమైనా ఉన్నాయా?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : What is Spa treatment?, స్పా-చికిత్సలు అంటే ఏమిటి? జాగ్రత్తలేమైనా ఉన్నాయా?

జ : స్పా(spa) అంటే సౌందర్య సంరక్షణకోసం కావచ్చు.. అలసిన శరీరానికి సాంత్వన నందించేందుకు కావచ్చు మినరల్ రిచ్ ... స్ప్రింగ్ వాటర్ గాని సముద్రం వాటర్ గాని వాడి మెడిషినల్ బాత్ ఇవ్వడము . కొన్ని రకాల నూనెలతో మసాజ్ చేయడము జరుగుతుంటుందీ క్లినిక్ లలో. ఈ విధానము మొదటిగా బెల్జియం దేశములో "స్పా" అనే  పట్టణములో అంకురార్పణం జరగడము వలన  స్పా చికిత్స అని పేరు వచ్చినది. ఐరన్‌ మరియు ఖనిజ లవణాలు లోపము వలన అనేక ఆరోగ్య రుగ్మతలు వచ్చేవని రోమనులు భావించేవారు.. . అందుకే ఈ విధమైన స్పా చికిత్సలు . ఇవి ఒక విధంగా బ్యూటీ పార్లర్ లాంటివే.
    సౌందర్య సంరక్షణకోసం కావచ్చు.. అలసిన శరీరానికి సాంత్వన నందించేందుకు కావచ్చు. ''స్పా'' లల్లో చికిత్స తీసుకోవాలనుకుంటున్నవారు . . . ఈ జాగ్రత్తలూ పాటించండి.

* ఫలానా సమస్య ఉంది. చికిత్స చేయించుకోవచ్చా అని సందేహిస్తుంటారు కొందరు. చెప్పాలంటే స్పా చికిత్సలు ఎవరైనా చేయించుకోవచ్చు అయితే గర్భిణులూ, నెలసరి సమయంలో, ఏదయినా శస్త్రచిక్సితో చేయించుకున్నప్పుడూ, జ్వరంగా ఉన్నప్పుడూ, చర్మసమస్యల్లాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రం చికిత్స తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ముందే అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా చికిత్సకు వెళ్లేముందు వైద్యుల సలహా పాటించడం చాలా అవసరం.

* చికిత్స తీసుకునేందుకు గంట ముందు ఏమీ తినకపోవడం, తాగకపోవడం మంచిది. దానివల్ల మీకు ఆ సమయంలో ఏ ఇబ్బందీ కలగకుండా ఉంటుంది. చికిత్స పూర్తయ్యాక ఎంతసేపటి తరవాత నీళ్లు తాగాలి, ఆహారం తీసుకోవాలనేది ముందే అడిగి తెలుసుకోవడం మంచిది.

* స్పాలకు వెళ్లి చికిత్సలు తీసుకునే ముందు.. ఎలాంటి దుస్తులు వేసుకోవాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. సాధ్యమైంతవరకూ మీకు సౌకర్యంగా, సులువుగా మార్చుకునేవి అయ్యుంటే మంచిది.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.