Monday, September 1, 2014

Increase in weight if sleeps lights on ?,లైట్లేసుకుని నిద్రపోతే లావవుతారా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ఫ్ర : లైట్లేసుకుని నిద్రపోతే లావవుతారా?

జ : లండన్‌: బాగా కాంతిమంతంగా ఉండేపరిసరాల్లో నిద్రించేవారు బరువు బాగా పెరుగుతారని పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రివేళల్లో లైట్లేసుకుని హాయిగా నిద్రపోయాం అనుకునేవారిలో బరువు పెరుగుదల స్పష్టంగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బీఎంఐ, పొట్ట, నడుము చుట్టుకొలతలు బాగా పెరిగినట్లు తేలింది. బరువుపెరుగుదలకు...రాత్రివేళల్లో కాంతిమంతమైన పరిసరాల్లో నిద్రించడానికి స్పష్టమైన సంబంధం ఉన్నట్లు తేలినప్పటికీ, అది ఎలాసాధ్యపడుతోందనే అంశంపై ఈ దశలో తమ వద్ద కచ్చితమైన రుజువులేవీ లేవని శాస్త్రవేత్తల బృంద సారథి ఆంటోనీ స్వెర్‌డ్లో తెలిపారు.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.