Saturday, September 20, 2014

మష్కిటో రిప్లెంట్స్(Mosquito replents) సురక్షితమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మష్కిటో రిప్లెంట్స్(Mosquito replents) సురక్షితమేనా?

జ : దోమల సీజన్‌ లో మస్కిటోరెపెల్లెంట్స్ వాడకం తప్పని పరిష్థితి. వీటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లలపై ఎలా ఉంటాయోననా సందేహం , ఆందోలన కలుగుతుంటాయి .అసలు పిల్లల గదిలో ఇవి దాడొచ్చో? లేదో కూడా  భయం గానే ఉంటుంది.

రెండు రకాల మస్కిటో రిపెల్లెంట్స్ అభిస్తాయి.  ఒకటి మనుషుల చర్మానికి , దుస్తులకు , నెట్ కు  అప్లై చెసేది. . . అవి - డీట్ (డైథిల్ టొల్యుమైడ్) , పెర్మిథ్రిన్‌.  రెండోది ... కాల్చడము ద్వారా దోమల్ని దూరంగా తెరిమేసేవి. . . అవి మ్యాట్స్ , కాయిల్స్ , లిక్విడేటర్లు రూపం లో ఉంటాయి. prallethrin liquid ,Transfluthrin liquid usally 1.6% w/w గా వాడుతారు .  ఎక్కువ కాన్‌సెంట్రేషన్‌ గా ఉంటే దుస్ప్రభాలు ఎక్కువ . . . అవి ఇరిటేషన్‌, చర్మము పై ర్యాష్ వంటివాటితో పాటు ఫిట్స్ , స్పృహకోల్పోవడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఉండవచ్చును. కనుక క్రీమ్‌ చాలా తక్కువ కాన్సెంట్రేషన్‌ తో ఉండాలి . కొద్ది కొద్ది గా నుదురు , చెవులు , పాదాలకు మాత్రమే రాయాలి.  మ్యాట్స్ , కాయిల్స్ , లిక్విడేటర్లు ... దగ్గు మరియు ఇతర శ్వాస సంభందిత సమస్యలకు కారణ మవుతాయి. ఎలర్జీలు , ఆస్తమా వంటి సమస్యలున్న కుటుంబాలలో  వీటిని వాడనే వాడకూడదు.

అల్పమైన ఒక ప్రాణి గుట్టుచప్పుడు కాకుండా మనల్ని దెబ్బతీసి అనారోగ్యానికి గురి చేసి కొద్ది వారాలపాటు మంచానికి కట్టిపడేస్తుంది. అదే దోమ. దోమలు మనతోపాటు సహజీవనం చేస్తూ రక్తం పీల్చి వ్యాధులకు గురిచేస్తాయి. రక్తాన్ని ఇన్ఫెక్షన్ కు గురిచేస్తున్న దోమలు, దోమకాటుకు గురవడంవల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా మరియు ప్రాణాంతకరమైన ఎల్లో ఫీవర్ తదితర వ్యాధులు సంక్రమించి అనేకమందిని శక్తిహీనులను చేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి , దోమల నివారణోపాయ మందులు వాడటం మంచిది. అయితే ఇవి చాలా వరకూ రసాయనాలతో తయారుచేసినవి . వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఊపిరితిత్తులకు మీద దుష్ప్రభాలు చూపెడుతాయి.

ఇంట్లో తయారుచేసుకొనే నేచురల్ దోమ నిరోధకాలు: దోమల నివారణకు 5 నేచురల్ హోం రెమడీస్ 1. లావెండర్ ఎసెన్సెషియల్ ఆయిల్ చాలా గ్రేట్ గా వాసన వస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఎఫెక్టివ్ మస్కిటో రిపిలెంట్ గా ఉపయోగిస్తుంటారు.  దోమ నిరోధకాలలో ఇది ఒక ఎఫెక్టివ్ దోమ నిరోధక ఉపాయం. లావెండ్ ఆయిల్ మరియు బ్లీచింగ్ పౌడర్ ద్రవాన్ని రెడీ చేసుకొని. ఈ మిశ్రమాన్ని కట్ చేసుకొన్న బాటిల్లో పోయాలి. పోసిన ఈ బాటిల్ ను ఒక మూల పెట్టాలి. అంతే ఈ వాసనకు దోమలను నివారించవచ్చు. 2. బాటిల్లో అరకప్పు వేడి నీళ్ళు పోసి అందులో పంచదార వేయాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత, ఈ బాటిల్లో ఈస్ట్ ను జతచేయాలి. ఈ సగం నింపిన బాటిల్ రివర్స్(బాటిల్ మూతి క్రిందికి)లో పెట్టి న్యూస్ పేపర్ చుట్టి లేదా పాత వస్త్రాన్ని చుట్టి, దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి. 3. బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు వేపనూనెను వేడినీటిలో మిక్స్ చేసి బాటిల్లో పోయాలి. చల్లారిన తర్వాత అందులో ఈస్ట్ ను జత చేయాలి. తర్వాత న్యూస్ పేపర్ ను చుట్టాలి. దీన్ని దోమలు ఎక్కువగా ఉన్నప్రదేశంలో చుట్టాలి. 4. మరో దోమ నిరోధకం తామర పువ్వులతో తయారుచేసుకోవచ్చు. తామరపువ్వులున్న నీళ్ళు కూడా దోమలను చంపటానికి బాగా సహాయపడుతాయి. ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ మస్కిటో రిపిలెంట్స్ . 5. అరగ్లాసు నీటిలో కొద్దిగా యూకలిప్టస్ నూనెను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్ప్రే బాటిల్లో వేసి దోమలున్న ప్రదేశంలో స్ప్రే చేయలి .



  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.