Friday, September 19, 2014

వ్యాయామం తో లైంగికవాంఛలు పెరిగేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర: మాకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మా వారిలో లైంగికవాంఛలు అసలు లేవనే చెప్పాలి. సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంటున్నారు. అలాగని ఆరోగ్య సమస్యలూ లేవు. ఇలాంటివారిలో మళ్లీ లైంగికవాంఛలు పెరగాలంటే వ్యాయామం సరైన పరిష్కారం అని ఓ చోట చదివా. వ్యాయామం చేయడం వల్ల అంత ఫలితం ఉంటుందా?

జ: శారీరకంగా దృఢంగా లేనివారితో పోలిస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు లైంగిక చర్యను ఎక్కువగా ఆనందిస్తారని చెప్పొచ్చు. వ్యాయామం చేయడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి. దీనివల్ల లైంగిక వాంఛలు పెరుగుతాయి. కలిగే సంతృప్తీ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పురుషుల్లో వయసుపెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్‌ హార్మోను స్థాయులు తగ్గుతాయి. లైంగిక వాంఛలు తగ్గడానికీ అది కూడా ఒక కారణమే. అయితే వ్యాయామం చేయడం వల్ల ఆ హార్మోను నిలకడగా ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసిక ఆనందం కూడా సొంతమవుతుంది. వ్యాయామంతో అందం, ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. ఇవన్నీ కూడా పరోక్షంగా లైంగిక వాంఛలు పెంచే మార్గాలే. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడిని అధిగమిస్తూ, సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోగలిగితే ఏ వయసులోనైనా లైంగికవాంఛలు తగ్గకుండా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాయామం అనేది కేవలం పురుషులకే కాదు కాబట్టి.. మీరూ చేయడానికి ప్రయత్నించండి. ఇద్దరూ కలిసి రోజూ కాసేపు నడిస్తే మంచిది. దీనివల్ల మానసికంగా కూడా అనుబంధం పెరిగి క్రమంగా దగ్గరవుతారు.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.