Tuesday, September 23, 2014

What is FODMAPS diet-ఫాడ్ మాప్స్ ఆహారము అంటే ఏమిటి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : What is FODMAPS diet-ఫాడ్ మాప్స్ ఆహారము అంటే ఏమిటి?

జ : ఫాడమాప్స్ అనేది మాలిక్యుల్ నిర్మాణానికి సంబంధించిన ఒక  సాంకేతికమైన చిన్న పేరు .సార్ట్ చైన్‌ కార్బోహైడ్రేట్ ఆహార పదార్ధాలు, డై సాక్కరైడ్స్ , మొనోసాక్కరైడ్స్ వీటిలో జతచేయడం జరిగినది.ఇవి చిన్న పేగులో పూర్తిగా గ్రహించబడవు . ఉదా: fructans , galactans , lactose, sorbitol , manitol , xylitol and maltitol . ఇవి ముఖ్యముగా  గోధుమలు , రై , ఉల్లి , వెల్లుల్లి , కాయధాన్యాలు , పాలపదార్ధాలు , తేనె ,యాపిల్స్ , పుచ్చకాయలు , పీచ్ లు , బ్లాక్ బెర్రీస్ , కృత్రిమ చెక్కెరలు , ప్రక్టోజ ఎక్కువగా ఉన్న మొక్కజొన్న మొదలగునవి. ఈ పదార్ధములు పేగులలో ఉండే బాక్టీరియా జీర్ణం చేస్తుంది. వీటివల్ల గ్యాస్ మరియు ఉబ్బరము కలుగుతాయి. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోం ఉన్నవారు ఇవి వాడకము మానేయాలి లేదా అతితక్కువగా వాడాలి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.