Saturday, September 13, 2014

Is good to reuse oils onec used in cooking?,నూనెలు మిగిలితే తిరిగి వాడొచ్చా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

  Q :   Is good to reuse oils onec used in cooking?,నూనెలు మిగిలితే తిరిగి వాడొచ్చా?

Ans : పిండి వంటకాలో, వేపుళ్లో చేసుకున్నప్పుడు చాలాసార్లు నూనె మిగిలిపోతుంటుంది. దీన్ని పోపు పెట్టటానికో, వేపుళ్లు చేయటానికో తిరిగి వాడుతుంటారు. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగించినపుడు దానిలోంచి విశృంఖల కణాలు పుట్టుకొచ్చి రకరకాల జబ్బులకు దారితీసే అవకాశముంది. విశృంఖల కణాలు క్యాన్సర్‌ కారకాలు కావటం వల్ల దీర్ఘకాలంలో కొన్నిరకాల క్యాన్సర్లనూ తెచ్చిపెట్టొచ్చు. ఛాతీలో మంట, గుండెజబ్బు, అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి జబ్బుల ముప్పూ పొంచి ఉంటుంది. కాబట్టి మిగిలిపోయిన నూనెను వాడటంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుష్ప్రభావాలను తగ్గించుకునే వీలుందని నిపుణులు సూచిస్తున్నారు.

* మిగిలిపోయిన నూనెలను ఎన్నిసార్లు వాడుకోవచ్చనేది నూనెల రకాలు, వేడి చేసిన సమయం, ఎలాంటి పదార్థాల తయారీకోసం వినియోగించారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

*మిగిలిపోయిన నూనె పూర్తిగా చల్లబడిన తర్వాత శుభ్రంగా వడపోసి గాలిదూరని సీసాలో భద్రపరచుకోవటం మంచిది. దీంతో నూనెలోని ఆహార పదార్థాలు తొలగిపోతాయి. త్వరగా చెడిపోకుండా ఉంటుంది.

* ఈ నూనెల రంగు, చిక్కదనాన్ని కూడా గమనిస్తుండాలి. రంగు బాగా ముదిరినట్టు కనిపించినా, మరీ చిక్కగా ఉన్నట్టు తోచినా వెంటనే నూనెని వాడకపోవటమే మంచిది.

* కాస్త వేడెక్కగానే నూనెలోంచి పొగ వస్తున్నట్టయితే అందులో 'హెచ్‌ఎన్‌ఈ' అనే హానికారక పదార్థం ఉండే అవకాశముంది. హెచ్‌ఎన్‌ఈకి పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌, కాలేయ వ్యాధి వంటి జబ్బులతో సంబంధం ఉండటం గమనార్హం.

* నిజానికి అన్ని నూనెలు ఒకే రకమైనవి కావనీ గుర్తించాలి. కొన్ని వేడిని ఎక్కువగా తట్టుకుంటే మరికొన్ని తక్కువ వేడికే పొగలు కక్కుతాయి. వేడిని ఎక్కువగా తట్టుకునే పొద్దుతిరుగుడు నూనె, తవుడు నూనె, పల్లీ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె వంటివి వేపుళ్లకు, పిండి పదార్థాల తయారీకి బాగా పనికొస్తాయి. ఇక వేడిని అంతగా తట్టుకోని ఆలివ్‌ నూనె వంటివి పోపుళ్ల వంటి తక్కువ వేడి అవసరమైనవాటకి పనికొస్తాయి. అందువల్ల వంటకాలకు అనుగుణంగా తగిన నూనెని ఎంచుకోవటం మేలు.

ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే.. తిరిగి వేపుళ్లకు వాడకూడదని గుర్తుంచుకోవాలి.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.