Sunday, September 21, 2014

మొటిమలు అవాంచిత రోమాలు సులువుగా బరువు పెరుగుతున్నాను పరిష్కారమేదైనా తెలియజేయండి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా వయసు 18 సం.లు విపరీతం గా మొటిమలు , చాతి పై అసాధారణముగా అవాంచిత రోమాలు పెరుగుతున్నాయి. సులువుగా బరువు పెరుగుతున్నాను . నా అత్మస్థైర్యము దెబ్బతుంటుంది. పరిష్కారమేదైనా తెలియజేయండి?.

జ : ఈ జనరేషన్‌ లో సాధారణము గా ఉండే సమస్య ఇది . సరియైన పరీక్షలు చేయించుకోండి . పెల్విక్ ఆల్ట్రా సౌండ్ , హార్మోనల్ ఎవల్యూషన్‌ అవసరమవుతాయి. " పాలిసిస్టిక్ ఒవేరియన్‌ డిసీజ్ " గలవారికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇన్సులిన్‌ మెటబాలిజం అసాధారణత ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనబడతాయి. దీనివల్ల ఓవరీస్ నుంచి మేల్ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంటుంది.

మీకు వ్యాయామము అవసరము ప్రతిరోజూ ఓ గంట పాటు వాకింగ్ చేయండి.  అధిక ప్రోటీన్‌ , పీచు పదార్ధాలు తింటూ , తీపి , కొవ్వుపదార్ధాలు తినడము మానేయండి. మంచి డాక్టర్ ని సంప్రదించి మేల్ హార్మోన్‌ ప్రభావము తగ్గిందే ట్రీట్మెంట్ తీసుకోండి.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.