Thursday, September 18, 2014

Salt is not good even in children?,ఉప్పుచిన్న వయసులోనూ ముప్పేఅంటారు. నిజమేనా?

  •  


ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఉప్పుచిన్న వయసులోనూ ముప్పేఅంటారు. నిజమేనా?

జ : యుక్తవయసులో ఆహార నియమాలేంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. కానీ చిన్నప్పటి జీవనశైలి, ఆహార అలవాట్లు పెద్దయ్యాక గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో ఉప్పూ మినహాయింపు కాదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఉప్పు ఎక్కువగా గల ఆహారాన్ని తినే యుక్తవయసు పిల్లల్లో.. ముఖ్యంగా అధిక బరువు, వూబకాయుల్లో కణాల వయసు వేగంగా తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన క్రోమోజోముల చివర టెలోమేర్స్‌ అనే రక్షణ తొడుగులు ఉంటాయి. కణాలు విభజన చెందిన ప్రతిసారీ వీటి పొడవు తగ్గుతుంది. ఇవి చాలా పొట్టిగా అయిపోయినప్పుడు కణ విభజన ఆగిపోతుంది. వయసుతో పాటు వచ్చే గుండెజబ్బు, క్యాన్సర్‌, మధుమేహం వంటి పలు సమస్యలకు ఈ కణ వయసుతో సంబంధం ఉండటం గమనార్హం. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం మూలంగానూ టెలోమేర్స్‌ పొడవు తగ్గుతుంటుంది. అయితే ఉప్పు ఎక్కువగా తినటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటున్నట్టు బయటపడటం గమనార్హం. అందువల్ల అధికబరువు, వూబకాయ పిల్లలు ఉప్పును తగ్గిస్తే.. కణ వయసు ప్రక్రియ నెమ్మదించే అవకాశముందని అధ్యయన నేత, జార్జియా రెజెంట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ హైడాంగ్‌ ఝు పేర్కొంటున్నారు. ఉప్పుతో కూడిన పిజ్జాలు, చిప్స్‌ వంటివి యుక్తవయసు పిల్లలు ఎక్కువగా తింటుంటారు. కేవలం వీటిల్లోనే కాదు.. కొన్నిరకాల బ్రెడ్స్‌, అల్పాహార తృణధాన్యాలు, సాస్‌లల్లోనూ ఉప్పు మోతాదు అధికంగానే ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.