Monday, September 29, 2014

పిల్లలకు మురికి మంచిదే

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఏడాది లోపు పిల్లలకు మురికి కొంతవరకు మంచిదే అని ఒక వారపత్రికలో చదివాను .ఎంతవరకు నిజము ?

జ : ఇంట్లో పసిబిడ్డ ఉంటే పాపాయికి ఏ రకము రుగ్మతలూ , ఇన్‌ఫెక్షన్లూ సోకకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటారు. దుమ్మూ , ధూలి , చీమా , దోమా రా కుండా అత్యంత శ్రద్ద వహిస్తారు. ఐతే ఏడాదిలోపు పిల్లలు కొద్దిపాటి మురికి , ఎలర్జెన్లు , ఇంట్లో ఉండె బ్యాక్టీరియాకు ఎక్స్ పోజ్  అయినట్లయితే ....... తదుపరి వయసులో ఎలర్జీలు , వీజింగ్ , అస్తమా వంటివాటినుండి రక్షణ కల్పించబడుతుందని తాజా పరిశోధనలవలన గుర్తించారు.

తొలి బర్త్ డే కంటే ముందుగా ఇటువంటి వాటిని ఎదుర్కొన్న పిల్లలు వాటి వల్ల  ఇబ్బంది పడడము కంటే ప్రయోజనాన్ని పొందగలరని నిపుణులు చెప్తున్నారు.  దేనికీ ఎక్స్ పోజూ కాకుండా అత్యంత సున్నితము గా పెరిగినట్లయితే ఇతరత్రా బయట  ఎక్స్ పోజ్ అయితే  త్వరితంగా ప్రభావం చూపుతాయి. అదే ఇంట్లోనే చిన్నతనము నుండి వీటి ప్రభావము కొద్దికొద్ది గా పడుతున్నట్లయితే ఇట్టే తట్టుకునే శక్తి కలుగుతుంది. ఏడాది తర్వాత వీటిని పిల్లలు సులువుగా అధిగమిస్తారు. . . అంటే కొంచం మురికి , బ్యాక్టీరియా , ధూలి   పిల్లల శరీరానికి సోకడమే మంచిది.

  •  *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.