Sunday, September 21, 2014

బిడ్డకు కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?, బిడ్డ ఏడుపుకు కారణాలు.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


 ప్ర : బిడ్డకు కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా?, బిడ్డ ఏడుపుకు కారణాలు తెలియజేయండి?

జ : బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్‌ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణంగా పిల్లల్లో కడుపు నొప్పి మూడు నాలుగు నెలల వయసు నుంచే మెదలవుతుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పి వస్తుందని చెప్పలేరు, దాన్ని పెద్దలే తెల్సుకోవాలి. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు. ఇలా ఏడవడంతో ముఖం, అరచేతులు, అరికాళ్ళు బాగా ఎరబ్రడతాయి పడుకోబెట్టిన కొద్ది సేపట్లోనే లేచి మళ్లీ ఏడుపు అందుకుంటారు.

ఏడుపుకు కారణాలెన్నో
సాధారణంగా మూడు నెలల వయసు నుంచే పిల్లలు తల్లిని, తమ చుట్టూ ఉన్న వారిని పదే పదే చూస్తూ గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తుంటారు.కాళ్ళూ,చేతులుఅదేపనిగాఆడిస్తూ వుంటా రు. ఊకొట్టి కబుర్లు చెప్పే వారు లేకున్నా ఏడుస్తుంటారు. అదే విధంగా చిన్న అసౌకర్యం కలిగినా గుక్కపట్టి ఏడ్చి పెద్దలకు ఊపిరి ఆడకుండా చేస్తుం టారు. శారీరకంగా ఇతర సమస్య లేమైనా ఉన్నాయేమో గమనించి తగు చికిత్సఇప్పించండి. పాల కోసం ఏడుస్తున్నారేమో తెలుసుకొని పాలుపట్టండి. నాప్కిన్‌ ఎప్పటికప్పుడు మార్చుతున్నారో లేదో చెక్‌ చేయండి. ఏదైనా వంటికి గుచ్చుకుని బిడ్డ అసౌకర్యానికిగురవుతున్నదేమో పరిశీ లించండి. పాలు తాగిన తర్వాత పిల్లవాడిని భుజం మీదుగా ఎత్తుకుంటే త్రేన్పు వస్తుంది. త్రేన్పు రాకపోయినా పిల్లవాడికి కడుపులోఅసౌకర్యంగా ఉండి ఏడుస్తూంటాడు.పిల్లవాడి భుజాల కిందుగా చేతులు వేసి పట్టుకొని చిన్నగా నడిపించండి దీంతో దేహమంతా కదిలి వ్యాయామం అవుతుంది. అజీర్తి లక్షణాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి.సంగీతపరమైన పాటలు వినిపించండి. లేదంటే మీరే ఓచక్కని పాటపాడండి.అబ్బాయి ఏడుపు హంఫట్‌ అయిపోతుంది. వెచ్చని నీటితోస్నానం చేయించండి. ఆరుబయట తిప్పుతూ పరిసరాలను పరిచయం చేయండి, ఏడుపు ఆపేస్తారు.మల,మూత్రాదులు సాఫీగా అవుతున్నాయా లేదా గమనించండి. ఇంట్లో ఎవరివైనా కడుపునొప్పి మందులు వుంటే వాటిని వేసే ప్రయత్నం చేయకండి. ఇలాంటి సొంత వైద్యాలు పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తాయి.

సాయంకాలమే ఎందుకు ఏడుస్తారు? సాయంకాలం కాగానే వీరికి ఏమవుతుంది?
సాధారణంగా చంటిపిల్లలు సాయంకాలంఎక్కువగా ఏడుస్తుం టారు, పగలంతాబాగానే ఉంటారు. అనిచాలా మంది ఆదుర్ధా పడుతుంటారు. దీనికి కారణంఉంది, పాలు తాగించేప్పుడు ఊపిరిపీల్చుకోవడంద్వారాపాలతోబాటుగాలికూడా కడుపులో కి చేరుతుంది. అయితే పాలు,గాలి కన్నాబరువుగావుండంతో డుపులో కింది భాగానికి చేరుతాయి. గాలి పైన వుంటుంది. పాలు తాగించిన తర్వాత బిడ్డను భుజం మీతుగా వేసుకొని త్రేన్పు వేస్తేగాలి బైటకి పోయి పిల్లవాడికి అసౌకర్యంగా అనిపించదు.అలాకాకుండా పాలుతాగిన వెంటనేపడుకోబెడితే పాలు, గాలికలిసిపోయిపాలు విరిగిపోయి వాంతికి వస్తుంది దీంతో పిల్లవాడు ఉక్కిరిబిక్కిరి ఏడుస్తాడు. ఈ నొప్పి 99శాతం వరకు సాయంత్రాలే ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా నిద్రపోకుండా అదే పనిగా ఏడిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదిం చండి.

సాయంకాలం నిద్ర వద్దు ?
సాయంకాలాలు పిల్లల్ని నిద్రపోనివ్వకుండా ఆడిస్తూ వుండండి. మీ పిల్లల వయసున్న ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయండి. పెద్ద పిల్లలయితే వారి స్నేహితులతో ఆడుకోమని ప్రోత్సహించండి. దీని వలన శారీరక వ్యాయమం అవుతుంది.మానసికంగా ఆరోగ్యంగా వుంటారు. ఆటలాడి అలిసిపోవడం వలన త్వరగా నిద్రపోతారు. ఇది ఎదిగే పిల్లలందరికీ వర్తిస్తుంది. కాస్త పెద్ద పిల్లలయితే భయంకరమైన దృశ్యాలు చూసినా, విన్నా నిద్రలో కలవరించి లేచి ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు దెయ్యం,భూతం వస్తుంది పడుకో అని చాలా మంది పెద్దవాళ్ళు ఈ రకమైన భయాల్ని పిల్లలు నిద్రపోవ డానికి ఉపయోగిస్తుంటారు. అప్పటికి నిద్రపోతారేమో కాని, ఏ చిన్న అలికిడి అయినా దెయ్యం వస్తుందేమోనని భయంతో బిగుసుకుపోయి ఏడుస్తారు. కనుక పిల్లలకి భయం కలిగించే విషయాలను పదే పదే చెప్పి నిద్రపుచ్చడం మంచిది కాదు. దానికన్నా ఏదైనా శాస్త్రీయ సంగీతమో...లైట్‌ మ్యూజిక్కో పిల్లలకు వినిపిస్తూ నిద్రపుచ్చాలి . కొంచెం పెద్దవాళ్లయితే నీతి కథలను చెప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నించాలి.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.