Thursday, October 2, 2014

eggs - fish- mutton- ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం.గుడ్లూ.చేపలూ తినడం వల్ల బరువు పెరగమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q :  ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం.గుడ్లూ.చేపలూ తినడం వల్ల బరువు పెరగమా?

Ans : మాంసం, గుడ్లూ, చేపలూ... ఇవి వరస పెట్టి తింటే ఏమవుతుంది? కెలొరీలు పెరుగుతాయి.. అమ్మో బరువు పెరిగిపోమూ అనిపిస్తుంది కదా! కానీ కాదు.. ప్రొటీన్లను ఎంతగా తింటే అంతగా బరువు తగ్గి నాజూగ్గా మారతారని అధ్యయనాలు చెబుతున్నాయి. గత అరవై ఏళ్లలో ప్రొటీన్ల వాడకం గణనీయంగా తగ్గిపోయిందనీ, దాని కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వూబకాయం సమస్య పెరిగిపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఆహారంలో తగినంత ప్రొటీన్ల శాతం లేనప్పుడు ఎంత తిన్నా ఆకలి అదుపులో ఉండదు. ముఖ్యంగా ప్రొటీన్లూ, కార్బోహైడ్రేట్ల సమతుల్యత పాటించడం చాలా అవసరం. అందులోనూ చాలామంది ఇష్టం లేకపోయినా కొత్త కొత్త ఆహార నియంత్రణల పేరుతో కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో తెలియకుండానే బరువుని పెంచే కార్బోహైడ్రేట్లకు దగ్గర అవుతున్నారు. కానీ ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, గుడ్లూ, చేపలూ తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చేపలని వారానికి మూడు సార్లూ, గుడ్డు రోజూ, కొవ్వులేని మాంసం వారానికోసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

  •  *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.