ప్ర : నా కళ్ళ వెంబడి ముడతలు , ఫైన్లైన్స్(చారలు) వచ్చాయి. వీటిని సహజముగా ఏవిధముగానైనా తగ్గించుకునే మార్గము ఉందా?
జ : కళ్ళ చుట్టూ గల ముడతల్ని , ఫైన్లైన్స్ ను " క్రోస్ ఫీట్(crows feet) " అంటారు .సుమారు 30 సం.లు వరకూ ఇవి కనిపించవు . ఆ పైన కొంతమందికి త్వరగా ను కొంతమందికి ఆలస్యము గాను కనిపిస్తాయి. ఇవి ముఖ అందాన్ని తగ్గిస్తూ ముసలితనమును ఎత్తిచూపుతాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన నాన్-ఇనారసిన్ చికిత్సలు , కీమ్స్ తో క్రమము తప్పని మసాజ్ లు ఉపయోగపడతాయి. రెటినాల్ , విటమిన్ 'A' గల క్రీములు వాడితే క్రమముగా మార్పు వస్తుంది.
పాలు , అలోవెరా , బాదం నూనె , బొప్పాయిగుజ్జు రాయడము వల్ల చర్మము బగుతుగా మారుతుంది. వీటితో పాటు కొంతమంది బొటాక్ష్ , ఫిల్లర్స్ , త్రెడ్ లిస్ట్ , రేడియోఫ్రీక్వెన్సీ వంటి ఇన్వాసివ్ - నాన్సర్జికల్ పద్దతులను అనుసరించవచ్చు.
- *===========================
- visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.