Saturday, October 18, 2014

Do Low-fat diet cause for infertility?,లోఫ్యాట్ డైట్ ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతుందా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : లోఫాట్ డైట్ ఇన్‌ఫెర్టిలిటీకి కారణమవుతుందా?

జ : ఎప్పుడూ కూడా లోఫ్యాట్ డైట్ తింటూ , కొవ్వు పదార్ధాలు పూర్తిగా మానేసే మహిలలో సంతాన అవకాశాలు తక్కువని ఇటీవలి కొన్ని వైద్య అధ్యయనాలు పేర్కొటున్నాయి.ఇటువంటి వారిలో మిగరా వారితో పోల్చితే 27 శాతము సంతాన అవకాశాలు తక్కువన్నది ఈ పరిశోధనల సారాంశము . సాధారణము గా కొవ్వు ఏమాత్రము లేని పదార్ధాలు తినేవారి శారీరక బరువు బాగా తక్కువగా ఉంటుంది.  సరియైన ఓవులేటరీ ప్రక్రియ కోసము కనీసమాత్రపు శారీరక బరువు , ఫ్యాట్ అవసరము . అలాగే శరీరములో కొన్ని స్టెరాయిడ్స్ ఉత్పత్తికి కొలెస్టిరాల్ (cholesterol) అవసరము  . లోఫ్యాట్  పదార్ధాలలోని కొన్ని ఆర్టిఫీషియల్ పదార్ధాలు ఉండడము వలన సంతాన రాహిత్యానికి దారితీస్తాయన్నది సాధారణముగా పరిగణించే విషయాలు. ఈ విషయాలనీ రూడి చేయడానికి ఇంకా కొంతకాలము వేచిఉండాలి. ఏది ఏమైనా ఆహారములో మితముగా ఆరోగ్యవంతమైన కొవ్వు తప్పనిసరిగా ఉండాలి.

  • *===========================

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.