Friday, October 24, 2014

Good oils for skin in wnter,చలికాలములో చర్మానికి తగిన నూనెలు తెలపండి?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


 ప్ర : శీతాకాలము లో నా చర్మము పొడిగా ఉండి పగిలి పోతుంది . చలికాలములో చర్మానికి తగిన నూనెలు తెలపండి?

జ : చలికాలములో పడిపోతే ఉష్ణోగ్రత , వీచే చలిగాలులు  చర్మాన్ని  చాలా ఇబ్బంది పెడతాయి ... కాబట్టి చర్మానికి ఈ ఋతువులో అధనపు రక్షణ అవసరము . ఆ రక్షణ అందించేవి తైలాలు. వీటిని చర్మము పైన మర్ధన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు వాడతగిన తైలాలలో ముఖ్యమైనవి ......

కొబ్బరినూనె : దీనిలో లవణాలు అధికము . దీనిని శరీరానికి రాసుకుంటే ముడుతలు  రాకుండా కాపాడుకోవచ్చును. చర్మము ఏ తరహా కి చెందినదైనా కొబ్బరినూనె వాడకము సరైనదే. పలురకాల చర్మరొగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకు ఉన్నది.

ఆలివ్ నూనె : చర్మ సౌందర్యానికి చక్కని సాధనము ఆలివ్ నూనె . దీనిలోని విటమిన్‌ 'E' యాంటి ఆక్సిడెంట్ గా చర్మము వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు . ఆలివ్ నూనె మర్ధన చేస్తే చర్మము ఎంతో చక్కని వెలుగును సంతరించుకుంటుంది.

ఆల్మండ్ ఆయిల్ : చర్మాన్ని ఎండిపోనివ్వదు ... ఈ నూనె రాసుకుంటే చర్మము తేమను గ్రహిస్తుంది. మీ చర్మము ఏ తరహాది అయినా ఈ ఆయిల్ ని రాసుకోవచ్చు . దురద , మంట వంటి సమస్యలను చర్మానికి రానివ్వదు . చర్మము పగలు కుండా కాపాడుతుంది.

నువ్వుల నూనె : ఇందులోని విటమిన్‌ 'B' , 'E' లు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. దీనిలోని కాల్సియం , మెగ్నీషియం ల ద్వారా చర్మము లబ్దిపొందుతుంది . సూర్య కాంతి ప్రభావము చర్మము మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనె తో శరీరము మర్ధన చేయించుకుంటే అలసట ఇట్టేపోతుంది. చర్మానికి తాజాదనము సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.

జజోబా నూనె : దీనిలోని సూక్ష్మజీవ్-సంహార గుణము వల్ల చర్మానికి చక్కటి రక్షణ ఇస్తుంది. చర్మములో సహజము గా ఉత్పత్తి అయ్యే తైలాలకు జజోబా ఆయిల్ లో ఉన్న రసాయనాలకు దగ్గరి పోలిక కనిపిస్తుంది అందువల్ల జజోబా నూనెను చర్మము ఎటువంటి ప్రతిచర్య చూపకుండానే గ్రహిస్తుంది. ఇది రాసుకుంటే చర్మానికి ఎలర్జీ ఉండదు. 

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.