Saturday, October 11, 2014

ఆరోగ్యం విషయములో మంచినీటి ఉపయోగాలేమిటి ?

  •  


  •  
 

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఆరోగ్యం విషయములో మంచినీటి ఉపయోగాలేమిటి ?

జ : చాలారకాల అనారోగ్యాలు అవసరయినంత నీటిని తాగక పోవడము వల్ల కలిగేవే . చాలామంది దాహము వేస్తేనో , వాతారణము వేడిగా ఉంటేనో నీరు తాగుతారు . . . తప్ప మామూలు పరిస్థితులలో అంతగా తాగరు. కాఫీ, టీ , శీతల పానీయాలు గాగేసి ద్రవ పదార్ధాలు తీసుమునాం కదా అని భావిస్తారు. కాని ఇవి మంచి నీటికి ప్రత్యామ్నాయాలు ఎంతమాత్రము కావు . మంచినీటిని చాలినంతగా గాగడానికి పదిరకాల కారణాలు చెప్పుకోవచ్చును .
  1. నీరు శరీరములోని ప్రతికణానికీ పోషకాలను అందేందుకు సహకరిస్తుంది.
  2. డిహడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది,
  3. కిడ్నీలను ఆరోగ్యము గా ఉంచి , మరింత సమర్ధవంగముగా పనిచేసేందుకు సహక్రరిస్తుంది. 
  4. కిడ్నీలో రాళ్ళు , ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది. 
  5. తక్కువ రక్తపోటు వారికి సాధారణ రక్తపోటు స్థాయిలు రావడానికి ఉపయోగపడుతుంది, 
  6. వ్యామామము వలన కోల్పోయిన ద్రవాలను బేలన్స్ చేస్తుంది. 
  7. శరీరము అధిక వేడికి గురికాకుండా పరిరక్షిస్తుంది. ,
  8. శరీరానికి శక్తినిస్తుంది , 
  9. అలసటను తగ్గిస్తుంది .
  10. శరీరములో జీవక్రియను ఉత్తేజపరుస్తుంది. హార్మోనుల సమతుల్యతను కాపాడుతుంది.
*
  • =========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.