Thursday, October 23, 2014

Bed wetting in children, పిల్లలలో పక్క తడుపు అలవాటు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా అబ్బాయి వయస్సు 7 సం.లు. ఇప్పటికీ రాత్రివేళల్లో పక్క తడుపు తుంటాడు . చలికాలములో అయితే మరీ ఎక్కువ . ఈ పరిస్థితిని ఏవిధం గా అధిగమించాలి?.

జ : పిల్లల పక్క తడుపు అలవాటుకు అనేక కారణాలు ఉంటాయి.
శారీరక కారణాలు ,
మానసిక కారణాలు ,
సామాజిక కారణాలు .
-------ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి.   పలానా కారణము అని స్పస్టముగా చెప్పలేము. ఇలా పక్క తడుపు అలవాటున్న పిల్లలు ... అభద్రతా భావముతోనూ, ఆత్మన్యూనత తో ఒంటరిగా ఫీలవుతుంటారు కూడా. కాబట్టి వీరికి === బరోషా ఇవ్వాలి . సంపూర్ణ మద్దతు ఇస్తూ దగ్గరకు తీస్తుండాలి. పదే పదే  అతనిలోని లోపాన్ని అతని ముందే చర్చించకూడదు.  ఓర్పుగా వ్యవహరించాలి. పడుకునే ముందు బాత్ రూం కి వెళ్ళే అలవాటు చేయాలి. మధ్యలో  ఒకటి రెండు సార్లు దగ్గరుండి తీసుకువెళ్తుండాలి . పిల్లల వైద్య నిపుణుల్ని ఓ సారి సంప్రదించండి.

  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.