Tuesday, October 28, 2014

Antacids in pregnency , గర్భిణి స్త్రీలు యాంటాసిడ్స్ వాడవచ్చా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను 5 నెలల గర్భవతిని. తరచూ ఆకలి వేస్తుంది. ఎక్కువగా తింటున్నాను . దీనివలన గుండెలో మంటగా ఉంటూంది. యాంటాసిడ్స్ తీసుకోవచ్చా?.ఏవైనా పదార్ధాలు మానేయాలా?

జ : గర్భం దాల్చాక తొలినెలలో వేవుళ్లు (వికారము , వాంతి) ఉంటాయి. దీనివలన కడుపులో ఎసిడిటీ ఎక్కువగా ఉండే అవకాశము ఉంటుంది. ఆహారము జీర్ణము అవడానికి ఎక్కువ సమయము పడుతుంది. కావున తక్కువ తక్కువ గా ఎక్కువసార్లు తినాలి. మనుషులలో ఈసోఫేగస్ ('oesophagas) చివర వాల్వ్ సాధారణము గా మూసికొని ఉంటుంది. గర్భము దాల్చిన  తరువాత హార్మోనుల ప్రభావము వలన ఓపెన్‌ అయి ఉంటుంది. దీంతో జీర్ణాశము లోని యాసిడ్ పదార్ధములు ఈసోఫేగస్ లోనికి రిగర్జిటేట్('Regurgitate) అవుతూఉంటాయి. అందువలన గుండెలో మంటగా ఉంటుంది.

తినగానే పడుకో వద్దు .. కనీసము 20 నిముషాలు తిన్నగా కూర్చోంది. లేదా 10 నిముషాలు చిన్నగా అటూ ఇటూ నడవండి. . కారము , మసాలా పదార్ధాలు ఎక్కువగా తినవద్దు . యాంటాసిడ్స్ తీసుకోవచ్చును . కాని ఐరన్‌ మాత్రలు... యాంటాసిడ్స్ వెంట వెంటనే గాని , కలిపి గాని తీసుకోకూడదు. ఈ రెండూ ఒకదానితో ఒకటి చిలేట్ ('chelate) అయిపోవడము వలన ఉపయోగముండదు.

  • *=========================== 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.