Sunday, August 31, 2014

What to eat to prevent tiredism?- అలసట దూరం కావాలంటే ఏమి తినాలి?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q ; What  to eat to prevent tiredism?- అలసట దూరం కావాలంటే ఏమి తినాలి?.

Ans : అలసటను దూరం చేయాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజు మొదలయ్యేటప్పుడు తీసుకోవాలి. టిఫిన్‌ సమయంలో గుడ్డు, ఓట్‌మీల్‌లో ప్రొటీన్‌ పొడి వేసుకోవడం లాంటివి అందుకు పరిష్కారాలు. అలాగే కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు సమతూకంలో ఉంటాయి. పండ్లు, నట్స్‌ లాంటివి తినడం వల్ల శక్తి పెరుగుతుంది.


జీర్ణక్రియ పనితీరు సక్రమంగా ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరం లాంటివి తగ్గుతాయి. అందుకే జీర్ణక్రియ పనితీరుకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

అధ్యయనాల ప్రకారం చాలామందికి నిద్రకు సంబంధించిన సమస్యలుంటాయి. అది సాధ్యం కావాలంటే ముందు పడకగదిలో టీవీ లేకుండా చూసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, నిద్రలేచేలా చూసుకోవాలి. పడకగది చల్లగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర పట్టకపోతే లేచి కాసేపు నడిచి మళ్లీ పడుకోవాలి తప్ప అలాగే ఉండకూడదు.

వ్యాయామం చేసేందుకు అలసిపోయారా.. అధ్యయనాల ప్రకారం మీరెంత ఎక్కువగా కదిలితే శరీరం అంత శక్తిమంతంగా తయారవుతుంది. దానివల్ల జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.