Monday, August 25, 2014

Improve immunity in children-పిల్లలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏమిచేయాలి.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏమిచేయాలి?.

జ : కొందరు చిన్నారులు తరచూ జలుబూ, దగ్గూ, జ్వరం బారిన పడుతుంటారు. దీనికి కారణం వాళ్లల్లో సరైన రోగనిరోధకశక్తి లేకపోవడమే. దాన్ని పెంచడానికి మందుల కన్నా.. సహజంగా ఆరోగ్యంగా ఉండేలా చేసేందుకు ఈ సూచనలు పాటించాలి.

పిల్లలు తినే ఆహారంలో ఓట్స్‌, దంపుడు బియ్యం లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి కాకుండా పండ్లూ, కాయగూరల్లో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ సహజసిద్ధంగా రోగనిరోధశక్తిని పెంచుతాయి. ముఖ్యంగా బొప్పాయీ, తర్బూజా, నల్ల ద్రాక్ష, చిలగడదుంపలూ, సోయా ఉత్పత్తుల్ని పిల్లలకు ఎక్కువగా తినిపించాలి.

కొన్నిసార్లు స్థూలకాయం కూడా రోగనిరోధశక్తిపై ప్రభావం చూపుతుంది. సన్నగా ఉన్న పిల్లలతో పోలిస్తే, అధికబరువున్న వారిలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకూ పిల్లలు బరువు పెరగకుండా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌ని తగ్గించాలి. పిజా లాంటి వాటి బదులు స్వీట్‌కార్న్‌, పండ్లతో చేసిన సలాడ్‌ లాంటివి అందివ్వాలి.

పిల్లలు సరిగ్గా పడుకోకపోయినా ఆ ప్రభావం రోగనిరోధశక్తిపై పడుతుంది. కాబట్టి వాళ్లు తగినంత సమయం నిద్రపోయేలా చూడాలి. అంతకన్నా ముందు అసలు పిల్లలకు ఎంత నిద్ర అవసరం అనేది తెలుసుకోవాలి. అప్పుడే పుట్టిన పాపాయికి కనీసం పద్దెనిమిది గంటలూ, చిన్నారులకు పన్నెండు నుంచి పదమూడు గంటలూ, స్కూలుకి వెళ్లని వారికి పదిగంటలు నిద్ర అవసరం. మధ్యాహ్నం పూట మీ పిల్లలు పడుకోకపోతే రాత్రిళ్లు త్వరగా నిద్రపోయేలా చూడాలి.

అన్నిరకాల క్రిములూ, బ్యాక్టీరియా వల్ల పిల్లలకు హాని జరగదు. కొన్నిరకాల క్రిములు పిల్లల్లోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి బ్యాక్టీరియా పేరుతో పిల్లల్ని ఇంట్లోనే ఉంచేయకండి. ఇతర పిల్లలతో హాయిగా బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. మట్టిలో ఆడినా వదిలేయండి. చిన్నవయసు నుంచే వ్యాయామం చేసేలా ప్రోత్సహిస్తే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగానూ ఉంటారు.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.