Saturday, August 16, 2014

Hints in selecting tooth paste,టూత్ పేస్ట్ ఎంపిక గురించి తెలియజేయగలరు ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : టూత్ పేస్ట్ ఎంపిక గురించి తెలియజేయగలరు ?

జ : పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి ఏ టూత్ పేస్ట్ అయితే ఏంటి ... అనుకొని ఏది పడితే అది ఎంచుకోకూడదు .  టూత్ పేస్ట్ లో ఘాటైనవి కాకుండా, ప్లోరైడ్  ఉన్నవి (0.15% కంటే ఎక్కువ ఉండకూడదు) ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా మనం ప్రతి నిత్యం వినియోగించే టూత్ పేస్ట్ మన పళ్ళకు రక్షణ కలిగించడమే కాకుండా నోటిలోని క్రిములును, నోటి దుర్వాసన నుండి  కాపాడుతుంది. టూత్ పేస్ట్ దంతాల పటిష్టతకు, తెల్లదనం, నోటి పరిశుభ్రతకు బాగా ఉపయోగపడతుంది.

టార్టార్ అనేది పళ్ళపై బ్రౌనిష్ గా పేరుకుపోతుంది. ఇది రెగ్యులర్ బ్రెషింగ్ తో వదలదు . పాచి అలా ఉండిపోయి , పేరుకుపోయినప్పుడు ఈ టార్టార్ డిపోజిట్ అయిపోతుంది.  ఆరోగ్యవంతమైన పళ్ళు , చిగుళ్ళకోసం .. టార్టార్ కంట్రోల్ టూత్ పేస్ట్ లు ఎంచుకోవాలి .వీటిలో పైరోఫాస్ఫేట్స్ ఉంటాయి.

ముప్పై సం.లు దాటాక చాలామంది గమ్‌లైన్‌లో తేడాలు వస్తాయి. దీనివల్ల వారి పళ్ళు సున్నితము గా మారుతాయి. చల్లని పదార్ధాలు తిన్నా , అవి తాకినా పళ్ళు జివ్వు మని లాగుతాయి. సెన్సిటివ్ టీత్ కోసం ఉద్దేశించిన టూత్ పేస్ట్ లు ఈ ఇబ్బంది నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. పళ్ళు తెల్లగా రావడానికనే లేబుల్స్ ఉన్న టూత్ పేస్ట్ లు అంత మంచివి కావు. టూత్ పేస్ట్ లు కొనేటప్పుడు పేరున్న కంపెనీల బ్రాండ్  లనే కొనాలి.

*===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.