Wednesday, August 20, 2014

Hints to prevent Flies nuicence-ఈగలు బెడద లేకుందా కొన్ని చిట్కాలు

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



Ques : వర్షాకాలములో మాఇంట్లో ఈగలు ఎక్కువ . వాటి న్యూసెన్స్ లేకుండా ఏధైనా ఉపాయము చెప్పండి?

Ans : ఈ కాలంలో ఈగలు బాగా ముసురుతుంటాయి. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికం. అందుకే వాటిని ఇంట్లో దొరికే పదార్థాలతోనే పారదోలవచ్చు.

దాల్చిన చెక్క: ఈగలు దాల్చిన చెక్క వాసనకు దూరంగా ఉంటాయి. ఇంట్లో ఈగలు ముసురుతున్న ప్రాంతంలో ముఖ్యంగా వంట గదిలో, భోజనాల బల్ల వద్ద దాల్చిన చెక్క పొడిని చల్లండి. లేదంటే గిన్నెలో తీసుకొని మూలల్లో ఉంచితే సరి, ఈగల బెడద తగ్గుతుంది.

చిక్కటి పాకం: నీళ్లలో కొద్దిగా చక్కెర, గంజిపొడి వేసి మరిగించాలి. పాకం చిక్కగా వచ్చాక మందపాటి పేపర్‌ మీద రాసి గదుల్లో నాలుగు మూలలకూ అంటించాలి. దీంతో ఈగలు గంజికి అతుక్కుపోతాయి. ముసురుకోవడం తగ్గుతుంది.

కీరదోస: కీరదోస ముక్కల్ని తరిగి వంటింటి గట్టు మీద, హాల్లో, భోజనాల బల్ల మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈగల సమస్య తగ్గుముఖం పడుతుంది.

వెనిగర్‌: ఓ గిన్నెలో గాఢత ఎక్కువగా ఉన్న వెనిగర్‌ తీసుకొని ఉంచాలి. ఈగలు అందులో పడితే చనిపోతాయి.

లవంగం: వంటగదిలో యాపిల్‌ను ముక్కలుగా కోసి అందులో లవంగాలను గుచ్చాలి. ఆ తరవాత ముక్కను వంటగదిలో అక్కడక్కడా పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి దూరంగా వెళ్లిపోతాయి. అలానే నేలను శుభ్రపరిచే నీళ్లలో కొన్ని చుక్కల లవంగాల నూనె వేసినా సరిపోతుంది. ఈ నూనె వాసనకు ఈగలు రావు. ఈగలు ముసిరిన చోట యూకలిప్టస్‌ నూనె చల్లినా ఫలితం ఉంటుంది.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.