Tuesday, August 5, 2014

గోళ్లు పెళుసుబారకుండా సూచనలు ఇవ్వండి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q :  గోళ్లు పెళుసుబారకుండా సూచనలు ఇవ్వండి ?

    Ans : చాలామంది ముఖం అందంగా కనిపించేందుకు తీసుకునే శ్రద్ధ చేతులపై చూపరు. ముఖ్యంగా గోళ్లపైన. అవి పెళుసుబారి, బలహీనంగా, నల్లగా మారి పోతాయి.గోళ్ళు బలహీనముగా , ఫెళుసుగా ఉన్నట్లైతే తరచూ చిట్లిపోతుంటాయి. గోళ్ళ ఆరోగ్యము కోసము విటమిన్‌ " సి " , కాల్సియం ఉన్న పధార్ధము లు తినాలి .
అలా కాకూడదంటే..

గాలి ఆడనివ్వాలి: గోళ్లకు స్వచ్ఛమైన గాలి అందాలి కాబట్టి.. అప్పుడప్పుడు గోళ్లరంగు వేయడం మానేయండి. సెల్‌ఫోన్‌లో తరచూ మెసేజ్‌లు టైప్‌ చేసేవాళ్లు.. కంప్యూటర్‌లో పనిచేసేవాళ్లను ఎప్పటికప్పుడు మంచి షేప్‌లో కత్తిరించండి.

తేమతో అందం: చర్మంతోబాటు గోటికీ తగినంత తేమ అందుతూనే ఉండాలి. తీవ్ర రసాయనాలతో కూడిన జెల్‌లూ, క్రీములతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం మానండి. చేతికి వాడే మాయిశ్చరైజింగ్‌ క్రీమునే గోళ్లకీ రోజూ పట్టిస్తే సరిపోతుంది.

బలాన్నిచ్చే పాలిష్‌లు: గోళ్లకు అవసరమైన ఖనిజాలూ.. విటమిన్‌లూ అందించే పాలిష్‌లూ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. వాటినే ఎంచుకోండి. అసిటోన్‌ వంటి కఠిన రసాయనాల మోతాదు ఎక్కువగా ఉన్న నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌లు అసలు వాడొద్దు.

మర్దన చేయండి: రెండుమూడు రోజులకోసారి గోళ్లకు గోరువెచ్చని బాదంనూనె రాసి మర్దన చేయండి. లేదంటే రెండు కప్పుల్లో గోరువెచ్చని ఆలివ్‌నూనెను సగం వరకూ తీసుకుని, నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి అందులో గోళ్లను ఉంచండి. కాసేపయ్యాక చేతుల్ని తీసేస్తే సరిపోతుంది.

మూలము : ఈనాడు వసుందర దినిపత్రిక - మే-2014
 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.