Tuesday, August 26, 2014

Care with pain.killers-నొప్పి మాత్రలతో జాగ్రత్త

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : నేను తరచూ నొప్పినివారణ మాత్రలు వాడుతుంటాను . . జాగ్రత్తలేమైనా తీసుకోవాలా?

జ : ఏమాత్రం తలనొప్పి, ఒళ్లునొప్పి అనిపించినా చాలామంది వెంటనే ఐబూప్రొఫెన్‌ వంటి నొప్పిని నివారణ మాత్రలను కొనుక్కొని వేసేసుకుంటుంటారు. ఇలా సొంతంగా ఎన్‌ఎస్‌ఏఐడీ (నాన్‌ స్టీరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) మందులను వాడటం తగదని.. ముఖ్యంగా రక్తం గడ్డ కట్టకుండా చూసే వార్ఫారిన్‌ వంటి మందులను వేసుకునేవారైతే మరింత జాగ్రత్తగా ఉండటం మంచిదని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇలాంటి మందులను వేసుకునేవారు ఎన్‌ఎస్‌ఏఐడీలు గానీ ఆస్ప్రిన్‌ గానీ వేసుకుంటే తీవ్రంగా రక్త స్రావమయ్యే ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలటమే దీనికి కారణం. అందువల్ల వార్ఫారిన్‌ వంటివి వేసుకునే వాళ్లు అవసరమైనప్పుడు ఎన్‌ఎస్‌ఏఐడీలను కాకుండా డాక్టర్‌ సలహాతో ఇతరత్రా నొప్పి మందులను వేసుకోవాలని సూచిస్తున్నారు.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.