Friday, August 29, 2014

పాప బాగా అల్లరి చేస్తుంది.మొండికేస్తుంది. వారిస్తే ఏడుపు.ఎలా నియంత్రించాలి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


 ప్ర : మా పాపకి 6 సం.లు. బాగా అల్లరి చేస్తుంది . ప్రతిదీ తన ఇస్టప్రకారమే జరగాలని మొండికేస్తుంది. వారిస్తే ఏడుపు.ఇది ఏమైనా ప్రమాదమా?ఎలా నియంత్రించాలి ?

జ : పిల్లలన్నాక అల్లరి చేస్తారు. చిన్నచిన్న వాటికి పేచీలు పెడుతుంటారు. అయితే ఏదయినా హద్దుల్లోనే ఉంటేనే ముద్దు. లేదంటే ఎదిగే కొద్దీ వారితో సమస్యే. కొన్ని సరదర్భాల్లో ఇతరులూ ఇబ్బంది పడతారు. అందుకే...చిన్నారుల అల్లరి ఒక్కసారిగా నియంత్రించడం సులువు కాదు. వయసుకు మించిన పరిణతి చూపిస్తున్నా, అనవసర విషయాల్ని అతిగా మాట్లాడుతున్నా వెంటనే అడ్డు చెప్పడం మేలు. మంచీ, చెడూ, పెద్దలతో మెలగాల్సిన తీరు వంటివి ఆచరణాత్మకంగా చూపించాలి. అప్పుడే నేర్చుకుంటారు.

గారాబం అంటే కోరినవి కాదనకుండా కొనివ్వడమనే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇది పిల్లలకు అలవాటయితే, దానికోసం మంకుపట్టు పట్టే ప్రమాదం లేకపోలేదు. పసి వయసులో వారివి చిన్న కోరికలే కావచ్చు, కానీ తేలిగ్గా తీసుకుంటే వయసుతో పాటూ వాటి స్థాయి కూడా పెరిగే ప్రమాదం ఉంది. అవి కొన్నిసార్లు మీ తాహతుకి మించి కూడా ఉండొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. అందుకే అవసరమైనవి కొనిచ్చి, అనవసరమైనవి కొనివ్వనని స్పష్టంగా చెప్పాలి.

చాలామంది పిల్లలు అల్లరి చేయడమే కాదు అబద్ధాలూ ఇట్టే చెప్పేస్తుంటారు. దీనికి ఎన్నో కారణాలూ ఉండొచ్చు. అలాంటప్పుడు వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. అలాగని మరీ కఠినంగా వ్యవహరించక్కర్లేదు. ప్రేమగా, స్నేహంగా మెలుగుతూనే ప్రతి విషయాన్నీ మీతో పంచుకునే అవకాశం కల్పించాలి. అవసరమైతే వాళ్లు చేసే చిన్న చిన్న తప్పుల్ని చూసీచూడనట్లు వదిలేయాలి. ఇవన్నీ వారిలో మార్పు తెస్తాయి.
*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.