Thursday, August 28, 2014

ఆరోగ్యవంతమైన స్లీప్-రొటీన్‌ కోసం ఏమిచేయాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా మనుమరాలు వయసు 5 సం.లు . ఆరోగ్యవంతమైన స్లీప్ రొటీన్‌ ను అనుసరించదు . ఏం చేయాలి ?.

జ : కొన్ని రోజులపాటు తన నిద్రకు సంబంధించి ప్రత్యేక శ్రద్ద వహిస్తుండాలి. పగటివేళ వీలయినంతవరకు ఎక్కువసేపు నిద్ర పోనీయకుండా చుడాలి. రాత్రి 9 గంటలు కల్లా ఇంట్లో టీ.వీ , కంప్యూటర్  లాంటివి ఆపేయాలి. మీ మనుమరాలికి పడుకోవడం తప్ప మరో ఆప్షన్‌ అనేది ఉండకుండా చేయాలి. లైట్ తీసేస్తే ఇక నిద్రకు ఉపక్రమించక తప్పదు . మిగతా వాళ్ళతా ఎవరి పనుల్లో వారుండి తనను నిద్రపొమ్మంటే ఇష్టపడరు. కొన్నాళ్ళ పాటు ప్రత్యేక శ్రద్ద వహిస్తూ ఒక రొటీను అలవాటు చేసినచో మీ మనుమరాలికి ఆరోగ్యవంతమైన నిద్రవేళలు అలవడుతాయి.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.