Friday, August 29, 2014

లైంగిక వాంఛలూ తగ్గిపోయాయి ఏదయినా ఆరోగ్య సమస్యా?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము
 ప్ర : మాకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరం ఉద్యోగస్తులమే. పిల్లలు పుట్టడం, బాధ్యతలు పెరగడంతో ఇద్దరికీ క్షణం తీరిక ఉండటం లేదు. అదే సమయంలో లైంగిక వాంఛలూ తగ్గిపోయాయి. ఒకప్పటితో పోలిస్తే, నెలలో ఒకటి రెండుసార్లు కూడా సన్నిహితంగా ఉండటం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏదయినా ఆరోగ్య సమస్యా లేక బాధ్యతలా? ఒకవేళ సమస్యే అయితే దీనికి పరిష్కారం ఉందా?

జ : మీకొక్కరికే కాదు... చాలామంది భార్యాభర్తల్లో ఇలాంటి సమస్య కనిపిస్తుంది. పెళ్లయిన కొత్తల్లో ఇద్దరూ ఎంతో ఆనందంగా, సరదాగా గడుపుతారు. క్రమంగా ఏళ్లు గడిచేకొద్దీ కొద్దికొద్దిగా దూరం పెరుగుతుంది. దాంతో ఏదయినా సమస్య ఉందేమోనని భయపడతారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూడా అంతే. అయితే పెళ్త్లె కొన్నేళ్లు గడిచాక లైంగిక వాంఛలు తగ్గుతాయా అంటే అవుననే చెప్పాలి. పడకగదిలో భార్యాభర్తలు లైంగిక జీవితాన్ని ఆనందించకుండా, కలయికకు దూరంగా ఉంటున్నారంటే... అందుకు పెళ్లయి చాలాకాలం అవడమూ ఓ కారణమే. దీనికితోడు సెక్స్‌ని రాత్రిళ్లు మాత్రమే ఆనందించాల్సిన చర్య అనే అభిప్రాయం ఉండటం వల్ల కూడా ఇద్దరిమధ్యా కొంతవరకూ దూరం పెరుగుతుంది. కిన్‌స్లే ఇనిస్టిట్యూట్‌ అందించిన నివేదిక భార్యాభర్తల్లో సగం మంది అరవై ఐదేళ్లు దాటాక కలయికను పూర్తిగా మానేస్తారని పేర్కొంటోంది. కానీ భార్యాభర్తల అన్యోన్యతకూ, అనుబంధానికీ సెక్స్‌ కూడా అవసరమే. కాబట్టి మీ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించండి. ముందు మీ జీవన విధానంలో మార్పులు చేసుకోండి. కొన్నిరోజులు ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఫాంటసీలకు ప్రాధాన్యం ఇవ్వండి. లైంగికచర్యలో కొత్త భంగిమలను ప్రయత్నించి చూడండి. వీలైనంత ఎక్కువగా ఫోర్‌ప్లేకి ప్రాధాన్యం ఇవ్వడమూ చాలా అవసరం. వీటన్నింటికీ తోడు ఇద్దరూ వీలైనంత ఎక్కువగా ఏకాంత సమయాన్ని కల్పించుకునేలా కొంతవరకూ మార్పు కనిపిస్తుంది

- Dr.Sharmila Majundhar@eenadu vasundara news paper
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.