ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : శీతల పానీయాలు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా?.
జ : శీతల పానీయాలు చిన్న పిల్లలకు ఎప్పుడో తప్ప రోజువారి ఇవ్వకూడదు. వీటిలో కెఫిన్ , కోకోవా , డెక్స్ ట్రిన్ వంటి మెదడును ఉత్తేజపరిచే పదార్ధాలు ఉంటాయి. తాత్కాలికము గా ఉసారు గా కనిపించినా కొన్ని గంటలు తరువాత బాగా అలిసిపోతారు. నీరసము గా కనిపిస్తారు. మెదడు పనితము పై ప్రబావము చూపును. ఇవి ఆకలిని మందగించును . మల్లీ మల్లీ తాగాలనే విదముగా అలవాటు పడతారు(habit forming). చల్లని పానీయాల వలన గొంతులో ఇన్‌ఫెక్షన్‌లే కాక ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు కూడా వ్యాధికి గురవుతాయి.
- *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.