Tuesday, August 26, 2014

తిండి విషయంలో మన ఇష్టాయిష్టాలను మన పేగుల్లోని బ్యాక్టీరియా నిర్ణయిస్తుందా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : తిండి విషయంలో మన ఇష్టాయిష్టాలను మన పేగుల్లోని బ్యాక్టీరియా నిర్ణయిస్తుందా?

జ : తిండి విషయంలో మన ఇష్టాయిష్టాలను మన పేగుల్లోని బ్యాక్టీరియా నిర్ణయిస్తుందా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనని అంటున్నారు పరిశోధకులు. మన పేగుల్లో బోలెడన్ని సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవి మన ఆహార అలవాట్లను గణనీయంగా ప్రభావితం చేస్తున్నట్టు.. తాము కోరుకుంటున్న పదార్థాలనే మనం తినేలా అవి మన మూడ్‌ను మారుస్తున్నట్టు అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, న్యూ మెక్సికో యూనివర్సిటీల అధ్యయనంలో బయటపడింది. ఇది వూబకాయానికీ దారితీస్తున్నట్టు కూడా వెల్లడైంది. పేగుల్లోని బ్యాక్టీరియాలో ఒకోదానికి ఒకోరకం పోషకం అవసరం. కొన్ని కొవ్వును ఇష్టపడితే మరికొన్ని చక్కెరను కోరుకుంటాయి. అందువల్ల మనకేది మంచిదన్నది కాకుండా.. ఇవి వాటికి అవసరమైన ఆహారం కోసం పోట్లాడుకోవటమే కాదు.. జీర్ణకోశ వ్యవస్థలో వాటి స్థానాన్ని కాపాడుకోవటానికి మన ఆహార అవసరాలను కూడా పట్టించుకోవటం లేదని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని మనకు అవసరమైన ఆహార పదార్థాలకు సర్దుకొని పోతే, మరికొన్ని తమకు కావాల్సిన వాటినే కోరుకుంటాయని పరిశోధకుల్లో ఒకరైన కార్లో మాలే పేర్కొంటున్నారు. వేగస్‌ నాడిలోని నాడీ సంకేతాలను మార్చటం ద్వారా.. అంటే రుచి గ్రాహకాలను మార్చటం, ఆయా పదార్థాలు మనకు ఇష్టం లేనట్టు తోచేలా విషతుల్యాలను పుట్టించటం, బాగా ఉందని అనిపించేలా రసాయనాలను ఉత్పత్తి చేయటం వంటి చర్యలతో ఇవి మన ప్రవర్తనను, మూడ్‌ను మారుస్తున్నాయని పరిశోధకులు వివరించారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానూ బాక్టీరియాను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉండటం విశేషం.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.