Friday, August 8, 2014

Care in Menopause period,ఏడాది గా ఋతుక్రమము ఆగిపోయింది.ఏవిధముగా కేర్ తీసుకోవాలి?


 

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : నాకు 48 సం.లు ఏడాది గా ఋతుక్రమము ఆగిపోయింది. హార్మోనులు తీసుకో్వడము నాకు ఇస్టములేదు . ఇతర ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా ఏవిధముగా కేర్ తీసుకోవాలి?

జ :
మెనోపాజ్‌ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్‌' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్‌ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.

45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్‌ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్‌ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్‌ హోర్మోన్స్‌ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.

ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్‌ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్‌ (స్త్రీ సెక్స్‌ హోర్మోన్స్‌) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.

మహిళల శరీరములో మెనోపాజ్ అనేది సహజము గా జరిగే ప్రక్రియ .ఈస్ట్రోజన్‌ తగ్గడము వల్ల వెజినల్ డ్రైనెస్ ఉంటుంది. కొందరు మహిళలో హాట్ ప్లషెస్ కూడా ఉంటాయి. ఆస్టియోపొరోసిస్ అవకాశాలూ ఉంటాయి. హాట్ ప్లషెస్ , మూడ్ స్వింగ అనృవి ఆ యా మహళల ప్రాధమిక ఎమోషనల్ పర్సనాలిటీకి బావోద్వేగానికి సంబందించినవి .కొందరు బాగా ఇబ్బందిపడితే , ఇంకొందరుకి ఎటువంటి సమస్యలూ లేకపోవచ్చు ను . భాగా యాంజైటీ గా ఉండే గుణము కలవారయితే...తప్పనిసరిగా అభద్రతగా ఫీలవుతారు. ఈస్ట్రోజన్‌ తీసుకోవడానికి , తీసుకోలేనివారికి పెద్ద వ్యత్యాసమేమీ ఉండదు . అయితే భాదలు బరించరాని పరిస్థితి అయితే రిప్లేస్ మెంట ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈస్ట్రోజన్‌ కి అనేక హెర్బల్ ప్రత్యాయాలు ఉన్నాయి.

మెనోపాజ్‌ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.


  • రాత్రి నిద్ర పట్టకపోవటం,
  • చెమట పట్టటం,
  • ఆకస్మికంగా గుండె,
  • మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,
  • వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.
  • ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
  • యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.

*===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.