Friday, August 15, 2014

Nightmares in children, పిల్లలలో నైట్ మేర్స్ అనేది సహజమేనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలలో నైట్ మేర్స్ అనేది సహజమేనా?

జ : ఎదిగే పిల్లలలో ఇవి సహజము గా ఉంటూఉంటాయి. పిల్లలలో ఒత్తిడి , యాంగ్జయిటీ ఉన్నప్పుడు ఇంకొంచము ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలను ఒంటరిగా పడుకొనివ్వక ... నిద్రపోయే దాకా వారితో ఉన్నట్లైతే భద్రతా భావముతో నిద్రలోకి జారుకుంటారు. . . కనుక పీడకలు , భయాలు తగ్గుతాయి. పడుకునే ముందు టెలివిజన్‌ లో భాయానక  దృశ్యాలు  చూసునా ఆ ప్రభావమూ వారిపై ఉంటుంది. గదిలో వెలిగే నైట్ బల్బుల రంగుల ప్రభావము కూడా ఉంటుంది. సాధారణము గా ఏ విషయము గురించి అయినా పిల్లలలో ఊహలు అనేవి వైల్డ్ గా ఉంటాయి.  వారి భయాలు గురించి మాట్లాడాలి. ఆయా పరిష్తితులను వారికి వివరించాలి. పిల్లలు పడుకునే ముందు మంచి కథలు చెప్పడము వలన హాయిగా నిద్రపోతారు. అన్నింటికంటే ముఖ్యము గా క్రమము తప్పని , రిలాక్సింగ్ బెడ్  టైమింగ్స్ సౌకర్యవంతముగా ఏర్పాటు చెయ్యాలి.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.