Sunday, August 17, 2014

How to recognise Stress? - ఒత్తిడిని గుర్తించడం ఎలా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : How to recognise Stress? - ఒత్తిడిని గుర్తించడం ఎలా?

A : పక్కన మరో వ్యక్తి ఉన్నారన్న ధ్యాస లేకుండా కేవలం మీ గురించి మాత్రమే ఒంటరిగా కూర్చుని గంటల తరబడి ఆలోచించుకొంటున్నారా? అయితే ఇది ఆందోళన లక్షణమే. ఎందుకంటే ఒత్తిడి పిల్లలూ, కుటుంబం, స్నేహితుల గురించి ఆలోచించనివ్వదు. కేవలం నేనూ, నా అవసరాలూ అన్నట్టుగా చేస్తుంది. ఇలా ఎవరినీ పట్టించుకోకుండా ఆందోళనలో గడపడం కూడా మంచిది కాదు. ఇది రానురాను ఆత్మన్యూనతగా మారుతుంది.

* బొమ్మలు వేయడం, గార్డెనింగ్‌, జిమ్‌కి వెళ్లడం, ఎంబ్రాయిడరీ చేయడం వంటి మీ ఇష్టాలని కావాలనే దూరంగా ఉంచుతున్నారా? ఆసక్తి ఉన్న వీటిని చేయడం కూడా బలవంతంగా జరుగుతున్నట్టు అనిపిస్తోందా. అయితే ఇదీ ఒత్తిడి లక్షణమే. మెదడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు చేస్తుంది. దాని ఫలితమే ఈ అయిష్టత.

* చేస్తున్న పని మంచిది కాదు, అది ప్రమాదంలోకి నెడుతుంది అని తెలిసినా దాన్ని చేస్తున్నారంటే అది ఒత్తిడి లక్షణాల్లో ఒకటి. దూకుడుగా బండి నడపడం, రన్నింగ్‌ బస్‌ ఎక్కడం అలాంటివే. విచారంగా ఉండటం, ఏడవడం మాత్రమే ఒత్తిడి లక్షణాలు అని అనుకొంటాం కానీ కోపమే అసలైన ఒత్తిడి లక్షణమట. అలాగే మైమరిచిపోయి ఉండాల్సిన చోట అంటే హాయిగా సినిమా చూస్తున్నప్పుడూ, గుడికి వెళ్లినప్పుడూ, స్నేహితులతో ఉన్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటే అది కూడా ఒత్తిడి లక్షణమేనని గుర్తించాలి.

* చివరిగా ఓ ప్రశ్న... మీరు ఆనందంగా ఉన్నారా... విచారంగా ఉన్నారా... అని అడిగినప్పుడు ఏదో ఒక సమాధానం స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. ఏమో... చెప్పలేను... ఫర్వాలేదు... తేల్చుకోలేకపోతున్నా... వంటి సమాధానాలు చెబుతుంటే ఒత్తిడిలో ఉన్నట్టే అర్థం. ఇలాంటి పరిస్థితిలో అందుకు ఏయే అంశాలు కారణమో సమీక్షించుకుని, తగ్గించుకునే ప్రయత్నాలు చేయడమే మంచిది.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.