Thursday, August 7, 2014

ముఖం మీద పల్చని ఫ్యాచ్ లు ఎందుకు వస్తున్నాయి? ఏం చేయాలి?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నాది పొడిచర్మము కాదు . . . కాని చలిగాలులు మొదలవగానే ముఖం మీద పల్చని ఫ్యాచ్ లు కనిపిస్తున్నాయి. ఎందుకిలా వస్తున్నాయి? ఏం చేయాలి?.
జ:మీకు పిటిరియాసిస్ ఆల్బా అనే అనే చర్మ సమస్య ఉంది . దీనికి ప్రత్యేకం గా ఇదీ కారణం అని చెప్పలేం కాని , సున్నితమైన చర్మం గలవారికి ఈ చలి సీజన్‌ లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చలికాలమే అయినా సూర్యకిరణాల తాకిడి ప్రభావం కూడా ఉంటుంది.
pityriasis alba - పిటిరియాసిస్ ఆల్బా : common form of pityriasis (usually in children or young adults) characterized by round patches of depigmentation .

నివారణ : ఆహారము లో విటమిన్‌ " ఏ" లోపించినా ఇటువంటి సమస్యలు వస్తాయి. పడుకునే ముందు తెల్ల మచ్చల మీద " హైడ్రోకార్టిసాన్‌" ఒక శాతము గల్ క్రీము అప్లై చేయండి. పగటివేళ spf 30 గ సన్‌స్క్రీన్‌ లోషన్‌ ను రాయండి . క్యారెట్ , చిలకడదుంప , పాలకూర , పాలు , గుడ్లు  వంటి ఆహారము తీసుకోవాలి .

 *===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.