Friday, August 1, 2014

ఖాళీ కడుపుతో ఉదయాన్నే సొరకాయ(ఆనపకాయ)రసము తాగడము వల్ల బరువు తగ్గుతారా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఖాళీ కడుపుతో ఉదయాన్నే సొరకాయ(ఆనపకాయ)రసము తాగడము వల్ల బరువు తగ్గుతారా?

జ : బరువు తగ్గుతారో లేదో గాని పచ్చి రసాలు పరగడుపున తాగితే గాస్ట్రిక్ ప్రోబ్లం వచ్చే అవకాశము ఉంటుంది . సొరకాయ బరువు తగ్గించడము లో సహకరిస్తుందనడానికి క్లినికల్ పరిశోధనలైతే లేవు . కొద్ది పాటి కిలోలు బరువు తగ్గాలనే ప్లాన్‌ చేసుకుంటున్నప్పుడైతే నిస్సంశయముగా సొర ఆరోగ్యవంతమయిన వెజిటబుల్ . దీనిలో 96.1 శాతము నీరు ఉంటుంది. 100 గ్రాముల సర్వింగ్ లో కేవలము 12 క్యాలరీలు శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో పీచు ఎక్కువగా ను , ' సి' విటమిన్‌ , బి. కాంప్లెక్ష్ , ఐరన్‌ , సోడియం , పొటాషియం అధికముగా ఉంటాయి కాబట్టి ఆకలిని తగ్గించును .

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.