Monday, July 28, 2014

ప్రతిదానికీ వాదించే ధోరణిలో వుండేవారితో ఏవిధముగా వ్యవహరించాలి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  ప్రతిదానికీ వాదించే ధోరణిలో వుండేవారితో ఏవిధముగా వ్యవహరించాలి?

జ : ఎదుటివారు ఎవరేం చెప్పినా చటుక్కున వాదించే , ఖందించే నైజం అనేకమందిలో కనబడుతుంటుంది .ఇటువంటి వ్యక్తులతో సమాజిక సంహధాలు కొంచెం కస్టమే. వారి వాదనలకు , ఖండనలకు , చర్చలకు ప్రతిస్పందించకపోవడమే మంచిది. 

ఇతరులతో సంహంధ బాంధవ్యాల సంగతి పక్కన పెడితే ఇలా ప్రతిదానికీ , అయినదానికీ కానిదానికీ గొడవలుపడే , వాదించే తత్వము వారి ఆరోగ్యానికే మంచిది కాదు . స్నేహితులతో , ఇంట్లోనివారితో ప్రతిసారీ గొడవకు దిగేవారిలో రక్తపోటు అవకాశాలు ఎక్కువ . స్ట్రెస్ హార్మోన్లు వీరిలోఎక్కువ విడుదలవుతుంటాయి. డిప్రెషన్‌ లక్షణాలూ ఉంటాయి. వారిచుట్టూ చేరడానికి భయపడేవారెక్కువ కాబట్టి వీరిలో ప్రేమరాహిత్యమూ తప్పదు .

భావాలను , తనలోని లోపాలనూ , గొడవపడే తత్వాన్ని వారు తమకు తాము గుర్తుందులొని వాటిని తగ్గిందుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలి. 
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.