Sunday, July 6, 2014

How much time do we do exercise daily?,రోజులో వ్యాయామము ఎంతసేపు చేయాలి?

 *

 *
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : రోజులో వ్యాయామము ఎంతసేపు చేయాలి?

జ : వ్యాయమాలకు  ఓ రెగ్యులర్ సమయము అంటూ ఉండడం లేదని చాలా మందిఫీలవుతుంటారు .ఓ సమయపాలనలో చేయలేకపోతున్నామన్న భావం కలుక్కు మనిపిస్తుంటుంది .. .. .. అయితే పరిశోధకులు ఈ భావం , భయము అక్కర్లేదంటున్నారు. వారం లో 150 నిముషాలు సమయము వ్యాయామము చేస్తే చాలని , సెషన్లు , షెడ్యూల్స్ తో నిమిత్తము లేదని వారు గుర్తించారు . వీకెండ్ లలో కుదినప్పుడు ఎప్పుడైనా 150 నిమిషాల వ్యాయామము వారం లో చేస్తే చాలు .

వారమంతా  రోజుకో 20 నిమిషాలు చొప్పున్న చేసినా , 3 - 4 రోజూలపాటు 150 నిమిషాల టార్గెట్ ముగించేసినా ఫలితం ఇంచుమించు ఒక్కటే . ఎక్షర్ సైజులు ఫ్రీకెన్సీ కి , వ్యాయామాలు లేకపోవడం వల్ల వచ్చే రుగ్మతలకు గుర్తించతగ్గ అనుసంధానము లేదు . ముఖ్యమైన సంగతేమంటే .. వారం లో కనీషము 150 నిమిషాల శారీరక చురుకుతనము ఉండాలి. ఎప్పుడు చేసినా , ఏ షెడ్యూల్ అయినా ఒక్కటే.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.