Tuesday, July 15, 2014

నా శరీరము ఎక్కువగా దుర్వాసనగా ఉంటుంది . దానిని ఏవిధముగా పోగొట్టుకోవాలి?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నా శరీరము ఎక్కువగా దుర్వాసనగా ఉంటుంది . దానిని ఏవిధముగా పోగొట్టుకోవాలి?

జ : స్వేదము , బ్యాక్టీరియా కలగలసి పోవడం వల్ల శారీరక దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే చెమటవాసన చెడువాసన వెయ్యదు. చెమట + బ్యాక్టీరియా చర్యవలన చర్మము ముడతలు దగ్గర దుర్వాసన గా ఉంటుంది. ఇలా ఉండడము శరీర తత్వము , శరీర పరిమాణము , బయట వాతావరరము మున్నగు అంశాలపైన ఆధారపడి ఉంటుంది.

సరైన వస్త్ర ధారణ , వ్యక్తిగత పరిశుభ్రత  పాటించడము వలన ఈ సమస్యను ఇట్టే తొలగించుకోవచ్చును . . . కాని కొంతమం ది విషయము లో ఈ సింపుల్ సూత్రము పనిచెయ్యదు . శారీరకమయిన దుర్వాసనకు ఇతరత్రా కారణాలు కూడా ఉంటుంటాయి. మెటబాలిక్ సమస్యలు( మధుమేహము) , ఒత్తిడి శారీరక దుర్వాసనను పెంచుతాయి. అత్యధిక ఒత్తిడి స్థాయిలు  శరీరము లో " ఎపో్క్రెయిన్‌ " గ్రంధులు స్వేదాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కొన్నిరకాల ఆహారపదార్ధాలు దుర్వాసనకు దోహదపడతాయని అంటారు కాని ఇది శాస్త్రీయము గా ఋజువు కాలేదు.

నివారణ :
  • పెప్పర్మెంట్ ఆయిల్ శరీరక దుర్వాసనను పోగొట్టును . ఈ నూనెను చర్మము సులువు గా గ్రహిస్తుంది. 
  • యాంటిపెరిస్పిరెంట్  లోషన్లు , స్ప్రేలు బజారులో దొరుకును ... వాడితే రోజంతా దుర్వాసస ఉండదు. 
  • డియోడరెంట్స్ దుర్వాసనను అడ్డుకొని రోజంతా తాజా ఉంచుతాయి. 
  • ప్రతిరోజూ రెండుసార్లు మంచి సబ్బుతో స్నానము చేయాలి.స్నానము చేసే నీళ్ళలో నిమ్మ రసము , పుదీనా వేసి స్నానము చేస్తే ఈ దుర్వాసన బారి నుండి బయటపడవచ్చును .
  • ప్రతిరోజూ లోదుస్తులు మారుస్తూ ఉండాలి , గాలి ఫ్రీ గా తగిలే దుస్తులే వాడాలి.

 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS - 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.