Tuesday, July 8, 2014

Advise to reduce over-weight ?,అధిక బరువుతో ఉన్నాను.తగ్గడానికి సలహా ఇవ్వండి ?

  •  

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నేను అధిక బరువుతో ఉన్నాను . దీనివల్ల అందరితో సరిగ్గా కలవలేకపోతున్నాను . చదువుపై కూడా అంతగా ఏకాగ్రత చూపలేక పోతున్నాను . ఒక్కోసారి చలా డిప్రెస్ అవుతుంటాను. ఏదైనా సలహా ఇవ్వండి .

జ : చాలా సార్లు ఆయా వ్యక్తుల బాడీ ఇమేజ్ వారి ఆత్మ స్థైర్యాన్ని ప్రభావితం చేస్తూవుంటూంది.  మిగతా అన్ని సమయాల్లో బాగానే ఉంటారు . . కాని బరువు ఎక్కువగా ఉన్నామని గుర్తుకు వచ్చేసరికి అన్ని వ్యతిరేక భావాలూ చుట్టుముట్టేస్తాయి. మిగతావాళ్ళు మీగురించి ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని వదిలేసి ... ముందుగా మీకోసము మీరు బరువు తగ్గడానికి చిత్తశ్రుద్దితో చర్యలు ఆరంభించండి . అసలు మీరెందుకు అధికబరువుతో ఉన్నారో విశ్లేషిందుకోండి .  సరైన ఆహారము తినడము లేదా? , ఎక్కువగా తింటున్నారా? , చాలినంత వ్యాయామాలు చేయడము లేదా? ఇవన్నీ పరిశీలించుకోండి . డైటీషియన్‌ సలహా తీసుకోండి.

బరువు సమస్యకు  ఏదైనా లోపము కారణము అవుతుందేమో తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయిందుకోవాలి . తదుపరి నిపుణుల సలహా పాటించి  జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అధిక బరువుకు ఆహారలోపాలు , జీవన విధానము సరిగా లేకపోవడము , వ్యాయామము లేకపోవడము కారణాలవుతాయి. ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ లేదా టి.వి స్క్రీన్‌ ముందు గడుపుతున్నట్లయితే శారీరక చురుకుదనానికి చాలా తక్కువ సమయము ఉంటుంది. . అది అధిక బరువుకు దారితీస్తుంది. తల్లిదండ్రు లిద్దరూ అధిక బరువుతో ఉంటే అదే శారీరక తీరు మీకు వచ్చే అవకాశము ఉంటుంది. వంశములో స్థూలకాయులు ఉన్నచో వారి వారసత్వము మీకు రావచ్చును . ఏది ఏమైనా ఎన్నో సౌలభ్యాలు  అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో మీకు నిజంగా బరువు తగ్గాలన్న కోరిక బలం గా ఉంటే అది తప్పకుండా సాధ్యపడుతుంది.
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.