Monday, August 4, 2014

Howlong to feed breatmilk?,పిల్లలకు స్తన్యం-తల్లిపాలు ఎంతకాలము ఇవ్వాలి .

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : Howlong to feed breatmilk?,పిల్లలకు స్తన్యం-తల్లిపాలు ఎంతకాలము ఇవ్వాల?.

జ : పాపాయిలకు పాలివాడాన్ని ఎంత వయసులో ఆపాలి అన్నది నిర్ధిస్టము గా చెప్పలేము . ఇది తల్లీ , పిల్లల ఆరోగ్య స్థితిగతులను బట్టి వుంటుంది. సాధారణముగా బిడ్డ ఘనపదార్ధాలను తీసుకోవడము ఆరంభించాక అంటే దాదాపు 6 నెలలు వయసు  నుంచి  స్థన్యం పాలు ఇవ్వడము తగ్గించవచ్చును . ప్రసవం తర్వాత తొలిరోజుల్లో రొమ్ముపాలలో " కోలోస్ట్రమ్‌" అనే పదార్ధము ఉంటుంది. దీనిలో ఎన్నోకీలక రోగనిరోధక శక్తిపెంచే పదార్ధాలు ఉంటాయి. 6 నెలలు పాటు తల్లిపాలు తాగే బిడ్డలలో ఇన్‌ఫెక్షన్‌ ను తట్టుకునే శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఆర్నెల్లు తర్వాత తల్లిపాలునుండి లభించే ఐరన్‌  సరిపోదు . . ఈ వయసులో ఘనపదార్ధాలు తినిపించడము ప్రారంభించాలి.

ఇఒందరు తల్లులు ఎంకాలము  అయినా పాలివ్వడానీ ఎంజాయ్ చేస్తారు. . . అయితే పిల్లలకు 4 ఏళ్ళు వచ్చేవరకూ పాలివ్వడము సమణ్జసము కాదు . ప్రపంచ ఆరోగ్య సంస్థ  2 ఏళ్ళు వయసు వచ్చేవరకూ తల్లిపాలు చాలని సూచిస్తుంది.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.