Tuesday, July 30, 2013

unwanted hair removal,అవాంచిత రోమాలు వాక్షింగ్

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *

 ప్ర : మా అమ్మాయికి 10 సం.లు ... తన చేతుల పైన , కాళ్ళపైన అవాంచిత రోమాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను వాక్షింగ్ చేసుకోవడము చూసి తనూ అలాగే చేయాలంటుంది. ఈ వయసులో పిల్లలకు వాక్సింగ్ చేయవచ్చా ? --------------- ఒక సోదరి.

జవాబు : చేతులు , కాళ్ళపై ఆ విధముగా వెంట్రుకలు రావడము హార్మోనుల ఇబ్బందులకు గాని, ఒవేరియన్‌ సిస్ట్ వంటి రుగ్మతలకు గాని సూచనకావచ్చు . మీ పాప అధిక బరువు వుంటే కనుక  ఈసమస్య ఎక్కువగా ఉంటుంది. ముందుగా పిల్లల వైద్యులతో తనకు చెకప్ చేయించండి. అవసరమైతే హార్మోనుల పరీక్షలు , అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించండి . . . అన్ని బాగుంటే వాక్సింగ్ సురక్షితముగా చేయవచ్చును. వాక్సింగ్  నొప్పితోకూడిన పక్రియ కనుక పాపకు ఆ విషయము ముందుగా చెప్పాలి.

ఓ రెండు మూడేళ్ళు పాటు  వాక్సింగ్ వంటి ప్రక్రియల కంటే " ప్యూమిక్ స్టోన్‌" రుద్దడము , నలుగు పెట్టడము వంటి  సంప్రదాయ , సహజ సిద్ధమైన పద్దతులవల్ల ఫలితము ఉంటుందేమో ప్రయత్నించండి .
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.