Friday, July 19, 2013

role of food labels in health,ఆరోగ్యవిషయములో ఫుడ్ లేబుల్స్ పాత్ర

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q :What is the role of food labels in health?.ఆరోగ్యవిషయములో ఫుడ్ లేబుల్స్ పాత్ర ఏమిటి?.

జ : ప్యాక్డ్ పదార్ధాల విషయములో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి . ఇందుకు సంబంధించిన  ఫుడ్ లేబుల్స్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఫుడ్ & డ్రగ్ ఎడ్మినిష్ట్రేషన్‌ (FDA) సిఫార్స్ చేసిన ఆహారలేబుల్స్ ఆ యా పదార్ధాలలో చెక్కెరలు , ప్రోటీన్లు , కొవ్వులు , ఇతత పోషకాలు ఎంతెంత ఉంటాయనంది సూచిస్తుంది. వీటిపైగల చాలా భాగము పోషకాల్ని గ్రాముల్లో పోర్కొంటారు. కొన్నింటిని మి.గ్రా. ల్లో తెలియజేస్తారు.

సర్వింగ్ సైజ్ , దానిలో వాడిన ఇత పదార్ధాల వివరాలు ఉంటాయి,తయారు తేదీలు ఉంటాయి.  ఏవి కొన్నా ముందుగా వీటిని చదువుకోవాలి. తమ తమ ఆరోగ్య స్థితిగతుల్ని బట్టి ఏ పాదార్ధాలు అవసరమో , ఏది ఎక్కుగో ,ఏదిపడదో  నిర్ణయించుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయాలి. ప్రదానముగా గనించాల్సినది తయారీ తేదీల్ని , క్యాలరీల మోతాదూ సరిచూడాలి. కాబట్టి కుటుంబము మొత్తము ఆరొగ్యాన్ని కాపాడే పాదార్ధాల షాపింగ్ ను హడావిడిగా , మొక్కుబడిగా ముగించక ఆచితూచి నింపాదిగా ఎంచుకోవాలి.
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.