Sunday, July 7, 2013

Diet and Life style in weight loss- డైట్ .లైఫ్ స్టైల్ ...వెయిట్లాస్ ప్రోగ్రాం ని ప్రభావితము చేస్తాయా?

  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 
 ప్ర : డైట్ , లైఫ్ స్టైల్ ...వెయిట్లాస్ ప్రోగ్రాం ని ప్రభావితము చేస్తాయా?.

జ : బరువు తగ్గాలని భావిస్తున్నట్లయితే ఈ రెండూ కీలక పాత్ర  వహిస్త్రాయి. దాదాపు 80 శాతము బరువు విషయాలు ఈ రెండింటితో ముడిపడి ఉంటాయి . బాగా వ్యాయమము చేస్తూ ఉన్నా ... ఆహారము , జీవన విధానము లోను సరిగా లేకపోతే ఆశించిన ఫలితాలు  పొందలేము . వేళ ప్రకారము భోజనము చేసినా మితము గా ఉండాలి . పనిలో పడి సమయానికి భోజము చేయక చిరుతిల్లు తిన్నా బరువు తగ్గే విషయము లో లాభము ఉండదు. చాలినంత నిద్ర పోతున్నారా  లేదా అలోచించాలి . చాలా మంది హిందూ స్త్రీలు  దేవుని పూజలు , వ్రతాలు పేరిట ఉపవాసాలు చేస్తారు కాని ప్రసాదము పేరిట చెక్కెర , నూనే పదార్ధాలు తింటూ ఉంటారు. ఇది కొవ్వుగా మారి శరీర బరువును పెంచుతుంది. కడుపునిండా అంబలి , గెంజి తాగిన వారికి అనారోగ్యము దూరము గా ఉంటుంది.
  • ==========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.